పార్టీపై ప‌ట్టు కోల్పోతున్న చంద్ర‌బాబు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కేవ‌లం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నార‌నే చ‌ర్చ కూట‌మి పార్టీల్లో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది. తా

టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ చెప్పుకునేవారు. కానీ ప్ర‌స్తుతం పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా పోతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు పార్టీ విధానాల‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ అధిష్టానం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితిలో లేక‌పోవ‌డం శ్రేణుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కేవ‌లం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నార‌నే చ‌ర్చ కూట‌మి పార్టీల్లో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది. తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు త‌దిత‌ర నేత‌ల అభిప్రాయాలు ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉన్నారు.

కూట‌మి 164 మంది ఎమ్మెల్యేల‌తో అత్యంత ప‌టిష్టంగా, అప‌రిమిత‌మైన అధికార బ‌లంతో ఉన్న‌ప్ప‌టికీ, తెలియ‌ని భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంద‌ని సొంత పార్టీ నేత‌లే అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీ గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి వాళ్ల‌లో కొంద‌రిని పిలిపించుకుని చంద్ర‌బాబు మంద‌లించార‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వాళ్ల‌లో మార్పు రాలేదు.

పెద్దోళ్లంతా త‌మ ఇళ్ల‌ను చ‌క్క‌దిద్దుకుంటున్నార‌ని, ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు సంపాదించుకోవాల‌ని కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు పెట్టామ‌ని, ఆ సొమ్మంతా అధికారంలో ఉన్న‌ప్పుడు రాబ‌ట్టుకోకుండా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఎలా వెళ్లాల‌ని వాళ్లు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంకా ఏడు నెల‌ల పాల‌న పూర్తి చేసుకోకుండానే కూట‌మి ప్ర‌భుత్వం నెగెటివ్ టాక్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… చంద్ర‌బాబుకు నాయ‌కుల‌పై కంట్రోల్ లేక‌పోవ‌డ‌మే. గ‌తంలో టీడీపీలో ఇలాంటి ప‌రిస్థితిని ఎప్పుడూ చూడ‌లేద‌ని సీనియ‌ర్ నేత‌లు వాపోతున్నారు.

18 Replies to “పార్టీపై ప‌ట్టు కోల్పోతున్న చంద్ర‌బాబు!”

  1. YCP nunchi janalu jump ayina kuda manchi control vundi Antav me anna ki…edo oka MLA ni pattukoni prati sari control ledu ani rastunnav. Mundu asalu control leni Vadiki cheppu.

  2. YCP nunchi janalu jump ayina kuda manchi control vundi Antav me anna ki…edo oka MLA ni pattukoni prati sari control ledu ani rastunnav. Mundu asalu control leni Vadiki cheppu*.

  3. YCheaP nunchi janalu jump ayina kuda manchi control vundi Antav me anna ki…edo oka MLA ni pattukoni prati sari control ledu ani rastunnav. Mundu asalu control leni Vadiki cheppu.

  4. సీబీన్ పట్టించుకోట్లేదు అని జగన్ ని పొగుడుతున్నాడు జేసీ

    ఒరేయ్ జగన్ ఏం హలత్ రా భాయ్ నీది “ఉంచుకున్న దానిలెక్క” వాడుతున్నాడు నిన్ను, జేసీ జగన్ ఉంటే జగన్ ని తిడతాడు సార్ .అదే జేసీ మేజిక్కు

Comments are closed.