2024లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నాయకులు వైసీపీని వదిలి వెళ్లుతున్న నేపథ్యంలో, వైసీపీకి పెద్ద ఊరటగా మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పార్టీలో చేరారు. శైలజానాథ్‌తో పాటు అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వైసీపీలో చేరారు. శైలజానాథ్ వైసీపీలో చేరబోతున్న విషయం డిసెంబర్‌లోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది.
ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 2020 – 2022 మధ్యలో ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
శైలజానాథ్ వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి స్పోక్‌స్పర్సన్ (ప్రధాన ప్రతినిధి) దొరికినట్లైంది. ఎందుకంటే, ఆయన మంచి విద్యావేత్తగా పేరుగాంచడమే కాక, అనేక పదవులను అనుభవించిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆయన్ని వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందో ముందుముందు తెలియాల్సి ఉంది. మరోవైపు శైలజానాథ్ చేరిక సమయంలో అనంతపురం నుండి సీనియర్ వైసీపీ నేతలు హాజరైనప్పటికీ, శింగనమల నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకులు హాజరుకాకపోవడంతో, శైలజానాథ్ చేరికపై మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలే:)
Simhanni puli vacchi kalisinattu vundi
Paytm lu enka brathike vunnarra?
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
జనవరి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారని ఇప్పటికే వెల్లడించారు.
జనవరి నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారని ఇప్పటికే వెల్లడించారు.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది,
మరి సింగమల టిప్పర్ డ్రైవర్ ని ఏమి చేసారు , పాపం అతనికి శంకరగిరి మాణ్యాలేనా…