స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి వల్ల రాజకీయంగా వైసీపీ అత్యధికంగా నష్టపోతోందన్నది నిజం.
హింస కారణంగా తాము నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి నెలకుందని, న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును వైసీపీ ఆశ్రయించింది.
వైసీపీ చూపిన ఆధారాలను చూసి, ప్రాథమికంగా అరాచకాలకు జరుగుతున్నాయనే నిర్ధారణకు సుప్రీంకోర్టు వచ్చింది.
అందుకే వైసీపీ ఫిర్యాదులు, వినతులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎస్ఈసీ అత్యవసరంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎక్కడెక్కడ ఏం జరిగింది? కేసులేవైనా నమోదు అయ్యాయా? తదితర అంశాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.
తమ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదికలు సమర్పించారు. మరికొందరు సమర్పించాల్సి వుంది.
టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, నామినేషన్ల పత్రాలను చించివేస్తున్నారని కేవలం అరుపులతో వైసీపీ సరిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దేనికైనా ఆధారాలు, ఫిర్యాదులు కీలకం.
తమపై దాడులు జరుగుతున్నాయని ఎన్నికల అధికారులకు, అలాగే పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వుండాలి. అప్పుడే సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పరిగణలోకి తీసుకునే అవకాశం వుంటుంది.
న్యాయస్థానానికి రాత మూలక ఆధారాలు తప్ప, మిగిలిన విషయాలు అనవసరం. ఈ విషయంలో వైసీపీ చట్ట ప్రకారం ఎంత వరకు ఫిర్యాదు చేసిందనేది ఇప్పుడు కీలకమైంది.
ఉదాహరణకు తిరుపతి కార్పొరేషన్ తీసుకుందాం. తమతో నామినేషన్ వేయించలేదంటూ వైసీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్, అలాగే 21 మంది అదే పార్టీకి చెందిన అభ్యర్థులు తిరుపతి జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు.
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అభినయ్ తదితర నాయకులంతా జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత ఫొటోలను మీడియాకి ఇచ్చారు. దీంతో ఫిర్యాదు అధికారికంగా రికార్డ్ అయ్యింది.
తిరుపతిలో వైసీపీ ఫిర్యాదు చేసినట్టుగా, మిగిలిన ప్రాంతాల్లో ఎంత వరకు చేశారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం మీడియా ముందుకొచ్చి తమతో నామినేషన్లు వేయించనివ్వలేదని, దాడులు చేస్తున్నారని వాపోయి వుంటే ప్రయోజనం లేదు.
ఆ విషయమై తమ పరిధిలోని పోలీస్, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి వుంటే, ఎస్ఈసీ ఇరుక్కుంటుంది. ఒకవేళ ఆ పని చేసి వుండకపోతే, ఎస్ఈసీ తప్పించుకునే అవకాశం వుంది.
సుప్రీంకోర్టు దృష్టికి వైసీపీ తీసుకెళ్లిందే తప్ప, క్షేత్రస్థాయిలో తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠ్ తప్పించుకుంటారు. అందుకే వైసీపీ ఫిర్యాదులపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటికైనా పరిషత్ ఎన్నికల్లో చెలరేగుతున్న హింసపై అధికారికంగా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం వుంది. అప్పుడే ఎన్నికల అధికారుల్ని, భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల్ని చట్టపరంగా శిక్షించే అవకాశం వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

మన గాలి జఫ్ఫా ల ఎదవతనం ఎంత బాగా కవర్ చేసావ్
దె0గలేక మంగళవారం అంటే ఇదే
Adi meeku baaga saripothundi.
anduke kada court ki poyaru labo dibo mani ..
దె0గలేక కోర్టుల మాటున దాక్కుని, ఇప్పుడు SECనీ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లంగాగాడు తూ.. అధికారం లేకపోతే ఇదీ నీ బతుకు .. ఇంతోటి దానికి నువ్వు పులి సింహం అని ఫేక్ ఎలివేషన్ అవసరమా లంగా మోహనా?
టైమ్ వాళ్ళది, కొడతారు కొట్టించుకోండి కానీ ఏకగ్రీవం కాకూడదు అని మా నాయకుడు జగన్ చెప్పాడు.. బాగా కొట్టించుకున్నాం.. ఇప్పుడు ఇలా కోర్టుకెళ్ళి ఏడవడం ఎం బాలేదు..
ఒకపక్క నామినేషన్స్ వేయనీయడం లేదు అంటున్నారు.. ఇంకో పక్క టీడీపీ కన్నా వైసీపీ వాళ్ళు ఎక్కువ నామినేషన్ వేశారు అని మీడియా లో వార్తలు వస్తున్నాయి..
ఇంతకీ ఏది నిజం?
A1 first class student ఒకడు టీచర్ కొట్టకముందే ఏడ్చేవాడు.. అలా ఏడిస్తే కొట్టాలనిపించినా కొట్టలేడు అనే వ్యూహం వాడిది..
కొంపదీసి ఇది కూడా అదే వ్యూహం కాదుకదా?
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో గెలుపు ఉత్సాహం కంటే మౌన రోదనే ఎక్కువగా కనిపిస్తోంది. బాయ్‌కాట్ అస్త్రంతో ఎన్నికల పరాభవాన్ని కప్పిపుచ్చుకుందామనుకున్న వ్యూహం కాస్తా కోర్టు తీర్పుతో బూమరాంగ్ కావడంతో వైసీపీ అధిష్ఠానం అయోమయంలో పడింది. ప్రజాక్షేత్రంలో ఓటమిని నేరుగా ఎదుర్కోలేక, ఎన్నికల బరి నుంచి పలాయనం చిత్తగించలేక తాడేపల్లి పెద్దలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తప్పించుకోవడానికి వేసిన న్యాయపరమైన ఎత్తుగడలే ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడంతో.. పైకి చిరునవ్వులు చిందిస్తూనే లోలోపల లబోదిబోమనే దుస్థితి వైసీపీ శ్రేణులకు దాపురించింది.
ప్రధాన విషయానికి వెళ్లండి
EN
హోమ్ > రాజకీయాలు
వైసీపీ: పారిపోదామనుకున్నా చేతకావట్లేదు!
రచయిత ramesh22 Oct 2026, 8:32 AM IST
ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై స సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పైకి మేకపోతు గాంభీర్యంతో స్వాగతిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతరంగంలో మాత్రం గుబులు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయటకు విజయం సాధించామంటూ సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేతల్లో ఏ ఒక్కరూ కూడా అంతర్గతంగా సంతోషంగా లేరన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యంగా మారింది. వివాదాస్పదమైన 19 మున్సిపాలిటీల్లో తిరిగి నామినేషన్లకు మార్గం సుగమమైందని, తమకు అవకాశం దక్కుతుందని ఆయా ప్రాంతాల వైసీపీ శ్రేణులు సైతం ఏమాత్రం సంబరపడటం లేదు.
ఎన్నికలు తప్పించుకోవడానికే వైసీపీ నేతల గొడవలు
వాస్తవానికి క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. ఆ 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా తప్పించుకోవడానికే వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా గొడవలు సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక, ఎన్నికల ఖర్చు భరించలేక, ఓటమి భయంతో అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో పోలీసులను, అధికార కూటమిని సాకుగా చూపిస్తూ కొన్నిచోట్ల రచ్చ చేసి.. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న వందలాది మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జెడ్పీటీసీ స్థానాలన్నింటి నుంచి ఎన్నికల బహిష్కరణ ముసుగులో ఏకకాలంలో పారిపోవాలని వైసీపీ వ్యూహరచన చేసింది.
సుప్రీంకోర్టులో పిటిషన్‌తో వ్యూహం రివర్స్
తాడేపల్లి వ్యూహకర్తల లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. న్యాయస్థానాల్లో ఎలాగూ అనుకూలమైన ఉత్తర్వులు రావు కాబట్టి.. కోర్టులు కూడా మాకు న్యాయం చేయలేదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు, అందుకే ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం అంటూ బాధితుడి కార్డు ప్రయోగించి మైలేజ్ పొందాలన్నది వైసీపీ ప్లాన్. అందుకోసమే కోర్టులో పిటిషన్ వేశారు. కానీ న్యాయస్థానం నామినేషన్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించి సమస్యాత్మక ప్రాంతాల్లో అవకాశం కల్పించాలని సూచనలు ఇవ్వడం వైసీపీకి ఊహించని షాక్‌గా మారింది. బరిలోంచి తప్పించుకుని పారిపోవాలనుకున్న పార్టీ నాయకత్వాన్ని సుప్రీంకోర్టు చొక్కా పట్టుకుని మరీ తిరిగి ప్రజాక్షేత్రంలో బరిలో నిలబెట్టినట్లయింది.
నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తారా?
ఇప్పుడు అసలైన సంకటం వైసీపీ నేతలకు ఎదురవుతోంది. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణ పెరగడంతో ఇకపై అడ్డంకులు, దౌర్జన్యాలు అంటూ తప్పించుకునే సాకులు పూర్తిగా మూసుకుపోయాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్లు వేయాల్సిందే.. కూటమి అభ్యర్థులతో ఢీకొట్టి తీరాల్సిందే. ఒకవేళ ఇన్ని అవకాశాలు, భద్రత కల్పించినా నామినేషన్లు వేయకపోతే.. దమ్ములేక, క్యాడర్ లేకే వైసీపీ తోకముడిచింది అని ప్రజల్లో పార్టీ పరువు నిలువునా గంగలో కలవడం ఖాయం. అటు ఎన్నికలను బహిష్కరిద్దామన్నా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రకటన చేస్తే సమాజం నవ్వులపాలు చేస్తుంది
ఎన్నికలు తప్పించుకోవడానికే వైసీపీ నేతల గొడవలు
వాస్తవానికి నామినేషన్లు దాఖలు చేయకుండా తప్పించుకోవడానికే వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా గొడవలు సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక, ఎన్నికల ఖర్చు భరించలేక, ఓటమి భయంతో అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో పోలీసులను, అధికార కూటమిని సాకుగా చూపిస్తూ కొన్నిచోట్ల రచ్చ చేసి.. ఎన్నికల బహిష్కరణ ముసుగులో ఏకకాలంలో పారిపోవాలని వైసీపీ వ్యూహరచన చేసింది.
కానీ
తాడేపల్లి వ్యూహకర్తల లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. న్యాయస్థానాల్లో ఎలాగూ అనుకూలమైన ఉత్తర్వులు రావు అనుకుంటే, సమస్యాత్మక ప్రాంతాల్లో అవకాశం కల్పించాలని HC సూచనలు ఇవ్వడం వైసీపీకి ఊహించని షాక్‌గా మారింది. బరిలోంచి తప్పించుకుని పారిపోవాలనుకున్న పార్టీ నాయకత్వాన్ని సుప్రీంకోర్టు చొక్కా పట్టుకుని మరీ తిరిగి ప్రజాక్షేత్రంలో బరిలో నిలబెట్టినట్లయింది.
ఇప్పుడు అసలైన సంకటం వైసీపీ నేతలకు ఎదురవుతోంది. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణ పెరగడంతో ఇకపై అడ్డంకులు, దౌర్జన్యాలు అంటూ తప్పించుకునే సాకులు పనిచేయవు.. ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సిందే.. కూటమి అభ్యర్థులతో ఢీకొట్టి తీరాల్సిందే. ఒకవేళ ఇన్ని అవకాశాలు, భద్రత కల్పించినా నామినేషన్లు వేయకపోతే..పోటీచేసే “దమ్ములేక, వైసీపీ తోకముడిచింది అని ప్రజల్లో పార్టీ పరువు నిలువునా గంగలో కలవడం ఖాయం. అటు ఎన్నికలను బహిష్కరిద్దామన్నా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రకటన చేస్తే సమాజం నవ్వులపాలు చేస్తుంది
నాకు తెలిసిన A1 FIRST CLASS STUDENT ఒకడు, తప్పు చేసిన ప్రతిసారి teacher కొట్టకముందే పొర్లాడి పోర్లాడి విపరీతంగా ఏడ్చేవాడు.. టీచర్ కొట్టడం అటుంచి, భయపడి వాడికి చాక్లెట్ ఇచ్చి సముదాయించేవాడు.. ఆ స్టూడెంట్ ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవుతున్నాడు ..
ఇక్కడ కోర్టు చాక్లెట్ ఇచ్చింది