వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన టీడీపీలోని ఒక వర్గంపై మరో వర్గం దాడికి దిగింది.
ఈ ఘర్షణలో ఒక కారుకు నిప్పు పెట్టారు. అలాగే కోడూరు బాలసుబ్రమణ్యం అనే టీడీపీ నాయకుడు ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
నందలూరు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ పదవిని టీడీపీకి చెందిన ఎద్దుల సుబ్బరాయుడు వర్గం, అలాగే తిరుపతిలో నివాసం ఉండే కోడూరి బాలసుబ్రమణ్యం వర్గం కావాలని పట్టు పట్టాయి.
ఎద్దుల సుబ్బరాయుడి కోడలికి ఎంపీపీ పదవిని కోరుకున్నారు. అలాగే డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తన తల్లిని ఎంపీపీగా చేయాలని అనుకున్నారు. కోడూరు బాలసుబ్రమణ్యానికి మేడా విజయశేఖర్‌రెడ్డి మద్దతు పలికారు.
మరోవైపు ఎద్దుల సుబ్బరాయుడు కుమారుడైన సాగర్ భార్య నందలూరు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఇవాళ కోడూరు బాలసుబ్రమణ్యం తన తల్లితో నామినేషన్ వేయించడానికి హంగామాగా వెళ్లారు.
అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఎద్దుల సాగర్ వర్గీయులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో సొంత పార్టీకి చెందిన కోడూరు బాలసుబ్రమణ్యం వర్గీయుల్ని తరిమే యత్నం చేశారు. కారుకు నిప్పు పెట్టారు.
దీంతో కోడూరు బాలసుబ్రమణ్యం ఒక్క సారిగా తన గన్‌తో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఒక కానిస్టేబుల్‌కు గాయాలైనట్టు సమాచారం.
నిజానికి ఎన్నికల సమయంలో తుపాకిని పోలీసులకు సరెండర్ చేయాల్సి వుంటుంది. కానీ కోడూరు బాలసుబ్రమణ్యం ఆ పని చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
కోడూరు బాలసుబ్రమణ్యం తిరుపతి అడ్డాగా రాజకీయాలు చేస్తుంటారు. లోకేశ్ వర్గీయుడిగా గుర్తింపు వుంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
నామినేషన్ కేంద్రాల వద్ద అల్లరి మూకలతో మోహరించి, వైసీపీ అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయడానికి రాకుండా అడ్డుకున్నట్టు చెబుతున్నారు.

Eenadu Enduku cover cheyadu ani rayi plss
తెలుగు దండు పాళ్యం పసుపు గొడ్డలి వర్గ పోరు బూడిద
లోకేష్ వర్గం అని చెప్పుకోవడమే తప్ప, ఇంక వేరే వాళ్ళది ఏముంది అక్కడ?
కాపీ పేస్ట్ ఫ్రమ్ ఈనాడు.
పొటొతొ సహా మొత్తం ఈనాడు నుండి కాపి! పైనా వీడు ఈనాడుకి జొర్నలిజం ప్రమాణాలు వళ్ళిస్తాడు!
ఏంటో మన పార్టీలో పోటీ చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.. కానీ అవతల పార్టీలో నేనంటే నేను అని తీవ్ర పోటీ పడుతున్నారు.. కానీ ఎందుకు?
ప్రాణాలు పోయినా సరే పోటీచేసి తీరుతాం అన్న “ప్రొద్దుటూరు బర్రె” శివప్రసాదరెడ్డి తన పెళ్ళాం తో నామినేషన్ సైలెంట్ గా withdraw చేయించాడు.. కానీ ఈ మంగళవారం కబుర్లు ఎందుకు ఇరువారం?
ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది🤣
చెప్పులు కావాలట బర్రె గారికి😀అటూ ఇటూ వాయించుకుంటాడు.
CMలని కూడా dictate చేసే powerful పెద్దిరెడ్డి ఈ ఎన్నికల్లో మేము పోటీ చెయ్యమని స్వస్తంగా ప్రకటించాడు..వీణ్ణి ఎవ్వరూ బెదిరించలేరు కదా.. మరెందుకు ఇలా మంగళవారం కబుర్లు చెబుతున్నావ్ ఇరువారం?
ఓడిపోయే పార్టీలో ఇంత పోటీనా? అదే మన పార్టీలో పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకిలా అరికట్లా?
మీరు గెలిచే పరిస్థితి లేదు వైస్సార్సీపీ భయం తో రానియ్యకూడదు అనుకున్నారు కానీ వైస్సార్సీపీ దెబ్బ టీడీపీ అబ్బా
Ninna pakkavaallani ibbandi pettina dourjanyam, ivvala mana vallani ibbandi pette varaku vacchindi. Manchi prabhutvam pokadalu!!
అచ్చు తప్పు. అది TDPలో వర్గ విభేదాలు కాదు. బానిసలు మంచి ఛాన్స్ ఇచ్చారు. “నేను వాడుకుంటానంటే, నేను వాడుకుంటాను” అని ఒకరినొకరు గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇటువైపు సీటు రాని వాళ్లందర్నీ అటువైపు తోసేసి, అక్కడి నుంచి నిలబెడుతున్నారు కదా.