జ‌గ‌న్ బెయిల్‌పై ర‌ఘురామ‌కు షాక్‌!

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోర‌డంపై ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అలాగే వేరే రాష్ట్రానికి విచార‌ణ‌ను బ‌దిలీ చేయాల్సిన అవ‌స‌రం లేదంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్‌, అలాగే కేసు విచార‌ణ‌కు మ‌రో రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌న్న పిటిష‌న్ల‌పై డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ త‌గిలింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ర‌ఘురామ పిటిష‌న్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం డిస్మిస్ చేయ‌డం విశేషం.

ఇటీవ‌ల జ‌గ‌న్ కేసుల్ని విచారిస్తున్న ధ‌ర్మాస‌నం కూడా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏం జ‌రుగుతుందో అనే ఆందోళ‌న వైసీపీ శ్రేణుల్లో నెల‌కుంది. ఇవాళ సుప్రీంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌, జ‌స్టిస్ స‌తీష్ చంద్ర‌శ‌ర్మ ధ‌ర్మాస‌నానికి మారుస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏదో జ‌రుగుతుంద‌ని ర‌ఘురామ ఆశించారు. కేసుతో మీకేంటి సంబంధ‌మ‌ని మారిన ధ‌ర్మాస‌నం నాలుగైదు రోజుల క్రితం ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఇది రాజ‌కీయ పిటిష‌న్‌గా జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది ముకుల్ రోహిత్గీ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు.

జ‌గ‌న్ కేసుల విచార‌ణ‌ను హైకోర్టు ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని సుప్రీంకోర్టుకు ముకుల్ విన్న‌వించారు. ట్ర‌యిల్ కోర్టులో ఇంకా డిశ్చార్జి పిటిష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఇదిలా వుండ‌గా సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వచ్చే వారానికి వాయిదా వేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోరిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేసు విచారణను 27వ తేదీకి జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాయిదా వేసింది.

ఇవాళ పిటిష‌న్ల‌పై సుప్రీం ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోర‌డంపై ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అలాగే వేరే రాష్ట్రానికి విచార‌ణ‌ను బ‌దిలీ చేయాల్సిన అవ‌స‌రం లేదంది. దీంతో పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంటాన‌ని ర‌ఘురామ త‌ర‌పు న్యాయ‌వాది కోరడం గ‌మ‌నార్హం. మొత్తానికి ర‌ఘురామ ప్ర‌య‌త్నాల‌న్నీ నిష్ప్ర‌యోజ‌న‌మ‌య్యాయి.

16 Replies to “జ‌గ‌న్ బెయిల్‌పై ర‌ఘురామ‌కు షాక్‌!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. బ్యాంకు ల నుండి దొబ్బేసిన డబ్బుతో యెంత ఖరీదయిన లాయర్లు ని పెడతాడు RRR . తాను కష్టపడ్డ సొమ్ము కాదు కదా.

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. మావోడు నిజ్జంగా సింగల్ సింగమే అయితే, విచారణ వాయిదా పడకుండా దైర్యంతో విచారణ ఎదుర్కుని ఏ తప్పుడు పని చెయ్యలేదు అని నిరూపించుకుంటాడు.. ఇక బెయిల్ & కోర్ట్పర్మిషన్ తో పని లేకుండా ప్రపంచం లో ఏ మూలకైనా స్వేచ్ఛగా వెళ్ళిపోతాడు..

  5. రవి గారు, మీ స్వాభిమానం గుర్తుంచుకోండి!”

    రవి గారు, మీరు ఒక చదువుకున్న, తెలివైన వ్యక్తి. మరి ఎందుకు ఎవరికైనా సేవకుడిలా ప్రవర్తించాలి? మీకు మీ స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉండాలి. ఎవరినైనా అంధంగా మద్దతు ఇవ్వడం మీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది.

    మీరు నిజంగా జగన్ గారు సంపాదించిన మొత్తం డబ్బు న్యాయంగా, నిజాయతీగా సంపాదించారనే నమ్మకంలో ఉంటే, దానిని బలంగా చెప్పండి. మీ అభిప్రాయాన్ని రుజువు చేయడానికి ఇతరుల అవినీతి గురించి చెప్పడం ఎందుకు? “ఇతర నాయకులు కూడా అవినీతిపరులే” అని చెప్పడం మీ నమ్మకాన్ని బలహీనంగా చూపిస్తుంది. మీరు జగన్ గారి నిజాయితీ గురించి నిజంగా నమ్మకంగా ఉన్నట్లయితే, ఆ నమ్మకాన్ని స్పష్టంగా మరియు ధైర్యంగా చెప్పండి—ఇతరుల గురించి ప్రస్తావించకుండా.

    అంధత్వంగా మద్దతు ఇవ్వడం, లాజిక్ లేకుండా సమర్థించటం, మీ గౌరవాన్ని దిగజార్చే పనిగా మారింది. మీకు నిజంగా జగన్ గారి మీద నమ్మకం ఉంటే, ప్రశ్నలు అడగండి, నిజం తెలుసుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. మీరు మీ ఆలోచనా శక్తిని ఉపయోగించి గౌరవాన్ని సంపాదించగలరు. రవి గారు, మీరు ఒక ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి. మీ వ్యక్తిత్వాన్ని, స్వతంత్రతను నిలబెట్టుకోండి. అజ్ఞాన సేవకత్వం నుంచి బయటపడండి, మీ గౌరవాన్ని తిరిగి పొందండి

Comments are closed.