బాబు వరాలు మోసుకొస్తున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఆయన లేటెస్ట్ స్కీం అయిన ఫ్రీ గ్యాస్ సిలెండర్ ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఇచ్చాపురం లో నవంబర్…

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఆయన లేటెస్ట్ స్కీం అయిన ఫ్రీ గ్యాస్ సిలెండర్ ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఇచ్చాపురం లో నవంబర్ 1న చంద్రబాబు పర్యటించనున్నారు

ఈ జిల్లా నుంచే ఆయన ఉచిత గ్యాస్ పధకానికి లాంచనంగా శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోటగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్కడ నుంచే మొత్తం సీట్లను గెలుచుకుంది. వెనకబడిన జిల్లాను అభివృద్ధి బాటన పయనింపచేస్తామని బాబు ఎన్నికల వేళ హామీలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. అంతే కాదు టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నో హామీలు ఉన్నాయి.

వాటిని ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న చంద్రబాబు ఏ మేరకు నెరవేరుస్తారు అన్నది ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉచిత గ్యాస్ పధకం హామీని నిలబెట్టుకున్నామని టీడీపీ చెబుతోంది. శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలని అక్కడ జనాలు కోరుకుంటున్నారు. ఎయిర్ పోర్టు ని జిల్లాకు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారు కానీ జిల్లా ప్రగతికి తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రజల కోరికగా ఉంది.

చంద్రబాబు గత సారి సీఎం అయినపుడు శ్రీకాకుళం జిల్లాను నంబర్ వన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు మళ్లీ సీఎం అయ్యారు. ఈసారి అయినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా అని అంతా తర్కించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక్కటీ కూడా శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేయలేదు. దాంతో ప్రజలలో ఆ అసంతృప్తి ఉంది. దాంతో ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఏ వరాలు ఇస్తున్నారో ఆ వివరాలు ఏమిటో చంద్రబాబు నోటి వెంట వినడానికే జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

12 Replies to “బాబు వరాలు మోసుకొస్తున్నారా?”

  1. గతం లో మీరు.. జగన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన .. ప్రతిపక్షాలకు వణుకు.. అని రాసుకొనేవాడివి..

    ఇప్పుడు అలానే.. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన .. ప్రతిపక్షాలకు వణుకు.. అని ఎందుకు రాయలేదు..?

    ఓహో.. ఇప్పుడు ప్రతిపక్షమనేదే లేదనా ..? కరెష్టే …!

      1. అందుకనేకదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా.. బెంగుళూరు తరిమేశాడు..LOL

        1. musalodu already alsasi poyadu…3 months kee telipoyindi…musalodi panithanam…. first 3 months lo 51000 crores loans ..thats how wealth creation…lol

          1. అందుకనేకదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా.. బెంగుళూరు తరిమేశాడు..LOL

          2. musalodu kasthame ….AP people understood …… assembly lo unna bayata unna musalodi paristhithi…..chala chiragga undhi…. AP people got bored with his gimmics….lol…wealth creation…. super six – deck outs.lol

          3. అందుకనేకదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా.. బెంగుళూరు తరిమేశాడు..LOL

  2. పరిశ్రమలు రావాలి అంటూ ఉంటారు మళ్ళీ ఇక్కడ వైస్సార్ thermal పవర్ ప్లాంట్ తెస్తే వెళ్లగొట్టారు, తుని దగ్గర దివిస్ ప్లాంట్ ని ఎవరు ప్రతిపక్షం లో ఉన్నా వ్యతిరేకిస్తారు!

Comments are closed.