సీదరి వర్సెస్ గౌతు

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం జీడిపిక్కల పరిశ్రమకు పేరు. ఇపుడు అక్కడ రాజకీయం సలసలా మరుగుతోంది. పలాస నుంచి నెగ్గిన తాజా ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు గౌతు శిరీష వర్సెస్ మాజీ మంత్రి వైసీపీ…

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం జీడిపిక్కల పరిశ్రమకు పేరు. ఇపుడు అక్కడ రాజకీయం సలసలా మరుగుతోంది. పలాస నుంచి నెగ్గిన తాజా ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు గౌతు శిరీష వర్సెస్ మాజీ మంత్రి వైసీపీ నేత సీదరి అప్పలరాజుల మధ్య రాజకీయ సమరం ముమ్మరంగా సాగుతోంది.

అక్కడ మాజీ మంత్రి సీదరి గృహ నిర్బంధానికి గురి అయ్యారని వైసీపీ నేతలు ఆరోపించారు. పలాసలో శాంతి భద్రతలు లేవని విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్లకు కూడా పసుపు రంగులు వేసేలా టీడీపీ నేతలు తెగించారని అన్నారు.

వైసీపీ కార్యకర్తలనే కొట్టి తిరిగి వారి మీదనే కేసులు పెడుతునారని అంటున్నారు. పలాసాలో శిరీష రాజకీయ దూకుడు అంతా అధికార పదవుల కోసం చంద్రబాబు లోకేష్ మెప్పు కోసమే అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మంత్రి పదవి కోసమే శిరీష ఈ విధంగా రాజకీయంగా వైసీపీని అణగదొక్కుతున్నారని అంటున్నారు.

శాంతియుతంగా ఉండే పలాసను రావణ కాష్టంగా చేసిన ఘనత గౌతు శిరీషదే అని ఆయన అంటున్నారు. పలాసలో గత అయిదేళ్ళుగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగింది. ఇపుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.

సీదరి అప్పలరాజు అరెస్ట్ టార్గెట్ గా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలాసలో ఇటీవల కాలంలో ఇద్దరు బాలికల మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేయలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నడూ చూడని ఘటనలు పలాసలో చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.

4 Replies to “సీదరి వర్సెస్ గౌతు”

Comments are closed.