సూప‌ర్‌సిక్స్ అమ‌లుకు రెండు, మూడేళ్లు ప‌ట్టొచ్చు!

సూప‌ర్ సిక్స్ అమ‌లుకు మ‌రో రెండు మూడేళ్లు చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప‌ట్టొచ్చు. బ‌డ్జెట్‌పై సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. రూ.2.94 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. ఇది ఉత్త‌మ బ‌డ్జెట్ అన్నారు.…

సూప‌ర్ సిక్స్ అమ‌లుకు మ‌రో రెండు మూడేళ్లు చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప‌ట్టొచ్చు. బ‌డ్జెట్‌పై సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. రూ.2.94 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. ఇది ఉత్త‌మ బ‌డ్జెట్ అన్నారు. సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయ‌డంతో పాటు కొత్త హామీల్ని కూడా అమ‌లు చేస్తామ‌ని బాబు చెప్పుకొచ్చారు. త‌మ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల వారి ఆకాంక్ష‌లు ఎక్కువ ఉన్నాయ‌ని బాబు చెప్పింది అక్ష‌ర స‌త్యం.

అందుకే అప‌రిమిత‌మైన అధికారాన్ని కూట‌మికి జ‌నం క‌ట్ట‌బెట్టారు. అయితే హామీల అమ‌లుకు తేవాలంటే ఎఫ్ఆర్‌బీఎం ష‌ర‌తులు అడ్డంకిగా ఉన్నాయ‌న్నారు. అమ్మ‌డానికి ఆస్తులు కూడా లేవ‌ని ఆయ‌న అన్నారు. వుంటే అమ్మేవాడిన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. అయితే త‌న ద‌గ్గ‌ర మంత్ర దండం ఏంటో చంద్ర‌బాబు చెప్పారు.

హామీల అమ‌లుకు డ‌బ్బుల్లేక‌పోయినా, కొత్త ఆలోచ‌న‌లు ఉన్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. వాటితో సంప‌ద సృష్టించి పేద‌రికాన్ని రూపుమాపుతామ‌ని చంద్ర‌బాబు ఇచ్చిన హామీతో జ‌నం ధైర్యంగా బ‌త‌కొచ్చు. ఎందుకంటే గ‌తంలో మూడు ద‌ఫాలు ఆయ‌న సీఎంగా ప‌ని చేశారు. సంప‌ద సృష్టించి పేద‌రికాన్ని ఏ విధంగా పార‌దోలారో ఆయ‌న పాల‌న‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. చంద్ర‌బాబుకు సంప‌ద సృష్టించి, జ‌నానికి పంచే తెలివి తేటలున్నాయ‌ని 2014-19 మ‌ధ్య కాలంలోనే అర్థ‌మైంది.

అందుకే క‌దా ఆయ‌న ఎన్నిక‌ల హామీల్ని అప్ప‌ట్లో అద్భుతంగా నెర‌వేర్చార‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ కింద ఒక్కొక్క‌రికి రూ.10 వేలు చొప్పున ఇచ్చారు. అలాగే రైతుల రుణ‌మాఫీని మూడు విడ‌త‌ల్లో చేసి, వ్య‌వ‌సాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారు. నిరుద్యోగుల‌కు వెయ్యి చొప్పున అంద‌జేసి, వాళ్ల బ‌తుకుల్లో వెలుగులు నింపారు. గ‌తంలో బాబు పాల‌న చివ‌రి ఆరు నెల‌ల్లో అన్నా క్యాంటీన్ల‌ను నెల‌కొల్పి పేద‌వాళ్ల కడుపు నింపారు.

సంప‌ద సృష్టించ‌డానికి కొంత స‌మ‌యం తీసుకుంటుంది క‌దా! డ‌బ్బులు ఊరికే రావు అనే విష‌యం తెలియ‌దా? ఇప్పుడు కూడా జ‌నం ఓపిక ప‌ట్టాలి. చివ‌రి రెండేళ్ల‌లో చంద్ర‌బాబు సూప‌ర్‌సిక్స్ హామీల‌న్నీ అమ‌లు చేస్తారు. ఈ లోపు ఆయ‌న సంప‌ద సృష్టిస్తారు. చంద్ర‌బాబు వ‌ద్ద కొత్త ఆలోచ‌న‌లు వుంటాయి. ఎందుకంటే ఆయ‌న ఆర్థిక శాస్త్రం చ‌దివిన విద్యార్థి. అందుకే క‌దా, ఆయ‌న ఎన్నెన్నో హామీల్ని ఇచ్చింది. బాబుపై న‌మ్మ‌కం వుంచండి. మీ బ‌తుకులు ఏమ‌వుతాయో, ఐదేళ్ల నాటికి చూసుకోండి.

16 Replies to “సూప‌ర్‌సిక్స్ అమ‌లుకు రెండు, మూడేళ్లు ప‌ట్టొచ్చు!”

  1. మళ్ళీ ఎన్నికల కోయిల కూసే వరకు ఈ పథకాలు చేతికి అందవు. ఇది ఆందరికీ తెలిసిన విషయమే.

  2. మంచి అవకాశం ఇస్తే ఎర్రిపూకుల పాలించి ఇప్పుడేంటి నీగోల, నువ్వు ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, ని బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రావు. తుత్తర కొంచెం ఓ రెండు ఏళ్ళు ఆపు, బాబు చేస్తారు. సాని-పావలా గాడిడే కొంచం అనుమానం.

  3. మంచి అవకాశం ఇస్తే ఎర్రిపూకుల పాలించి ఇప్పుడేంటి నీగోల, నువ్వు ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, ని బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రావు. తుత్తర కొంచెం ఓ రెండు ఏళ్ళు ఆపు, బాబు చేస్తారు. సాని-పావలా గాడిడే కొంచం అనుమానం.

  4. మంచి అవకాశం ఇస్తే ఎర్రిపూకుల పాలించి ఇప్పుడేంటి నీగోల, నువ్వు ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, ని బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రావు. తుత్తర కొంచెం ఓ రెండు ఏళ్ళు ఆపు, బాబు చేస్తారు.

  5. ఏది సంపద సృష్టి.. ?

    గత ఏడాది వరుకు ఇసుక మీద కొంత సీనరేజ్ వసూలు చేసే వారు.. దాంతో అప్పుడు 750 కోట్ల ఆదాయం ప్రతీ సంవత్సరం వచ్చేది…

    ఇప్పుడు ఫ్రీ పేరు చెప్పి రూపాయి ఆదాయం లేదు.. కానీ ఇసుక రేట్స్ తగ్గలేదు..

    ఏది సంపద.. ?

  6. ఏది సంపద సృష్టి.. ?

    =========

    గత ప్రభుత్వం 17 మెడికల్ colleges కన్స్ట్రక్షన్ చేసింది.. అందులో 5 కంప్లీట్ గా పూర్తి చేసింది.. ఇంకో 5 కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి… ఇంకో 7 ప్లానింగ్ ఫేస్ లో ఉన్నాయి..

    కట్టిన వాటిని ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్లకి అప్పుచెప్పుతున్నారు… కట్టని వాటి పరిస్థితి ఏంటో తెలీదు.. బడ్జెట్ లో ఒక్క రూపాయి లేదు ..

    =========

    ఏది సంపద సృష్టి.. ఎవరికీ వెళ్తుంది ఆ సంపద .. ?

  7. ఏది సంపద సృష్టి.. ?

    గత ప్రభుత్వం 4 పోర్టులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది.. అందులో ఒకటి దాదాపు పూర్తి అయింది.. ఇంకో 2 – 50 % దాకా పూర్తి అయ్యాయి.. ఒకటి 20 % అయ్యింది… అవన్నీ కంప్లీట్ అయితే..అది ఒక రాష్ట్ర సంపద… రాష్ట్రానికి ఒక ఆదాయం.. ఎన్నో వ్యాపారాలకు పునాది.. ఒక వైజాగ్ పోర్ట్ వల్లే వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందింది .. అదే విధంగా కాకినాడ. కూడా… ఈ నాలుగు పూర్తి అయ్యుంటే, రామాయ పట్నం, మచిలీ పట్నం, శ్రీకాకుళం ఎంతో అభివృద్ధి చెందేవి..

    కట్టిన వాటిని ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్లకి అప్పుచెప్పుతున్నారు… కట్టని వాటి పరిస్థితి ఏంటో తెలీదు.. బడ్జెట్ లో ఒక్క రూపాయి లేదు ..

    ఏది సంపద సృష్టి.. ఎవరికీ వెళ్తుంది ఆ సంపద .. ?

  8. ఏది సంపద సృష్టి.. ?

    ===============

    గత ప్రభుత్వం మద్యాన్ని గోవెర్నెమెంట్ షాప్ ల ద్వారా అమ్మేది.. దాంతో మద్యం కంట్రోల్డ్ గ ఉండేది.. ఆదాయం మొత్తం గవర్నమెంట్ కె వచ్చేది.. కేవలం ప్రభుత్వమే అమ్మడం వల్ల మద్యం వాడాకాన్ని తగ్గించడానికి ఎక్కువగా అమ్మే బ్రాండ్స్ తగ్గించి, ఒక్కో సారి పూర్తి అమ్మకుండానే ఉండేది.. దాంతో జనాలు మద్యం తాగడాన్ని తగ్గిస్తారని.. అదే విధంగా రేట్స్ కూడా ఎక్కువ పెట్టేది.. అందువల్లే గత అయిదేళ్ళు తాగే క్వాంటిటీ తగ్గింది.. రేట్స్ పెంచడం, సొంతంగా నడపడం వల్ల ఆదాయం పెరిగింది గానే , తాగే వాళ్ళు తగ్గ్గరు ..

    ======

    ఇప్పుడు .. వీధికొక మద్యం షాప్ .. తాగే వాళ్లకి అందుబాటులో ఉండడానికి అందుబాటులో ఉండే రేట్.. ఇంకా అందుబాటులో ఉండదేదో అని.. boledanni బెల్ట్ షాప్ లు.. దాంతో ఎక్కడ పడితే అక్కడ తాగి తూలుతున్నారు.. ఏది పడితే అది తాగి తూలుతున్నారు..

    ఆ షాప్ లు అన్నీ ఎవరికీ వచ్చాయి.,. ? ఎలా వచ్చాయి.. ? ఎంత రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది.. ఎవరికీ వెళ్తుంది.. ?

    ==========

    ఏది సంపద సృష్టి.. ఎవరికీ వెళ్తుంది ఆ సంపద .. ?

    1. I appreciate this comment.

      Dabbante evariki chedu..Dabbu kaavali government nadapadaniki.. thirupathi lo srivani trust 10000 ticket meeda andaru vimarsalu chesaru .. ippudu ade continue chesthunnaru… isuka policy meeda ippudippude andaru previous government policy baagundi antunnaru.. liquor policy kooda andaru previous govt policy ne baagundi antunnaru.. sri vani trust kooda continue chesthunnaru…andaru voluntaries system bagundani annaru..ippudu thisesaru.. mellaga andariki artham avuddi.

  9. మీరు పేదరికాన్ని రోపుమాపుతారు….. మీరు మీ. గత పాలన కాలంలో పెదారికాన్ని రూపుమాపడానికి ఏమైనా చేసింది ఉందా….. లేదు….. ఇప్పుడు పేదరికాన్ని రూపుమాపుతారు………

Comments are closed.