పవన్ ను పొగిడిన బన్నీ.. గొడవలు తగ్గుతాయా?

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య రాజుకున్న నిప్పు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా పవనిజం అంటూ ఇటు పవన్ అభిమానులు, అల్లు ఆర్మీ అంటూ అటు బన్నీ ఫ్యాన్స్…

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య రాజుకున్న నిప్పు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా పవనిజం అంటూ ఇటు పవన్ అభిమానులు, అల్లు ఆర్మీ అంటూ అటు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకుంటూనే ఉన్నారు.

మధ్యమధ్యలో ఒకట్రెండు సందర్భాల్లో పవన్-బన్నీ కలుసుకున్నారు. ఓ సందర్భంలో ఇద్దరూ కౌగిలించుకున్నప్పుడు ఆల్ సెట్ అనుకున్నారు. మరో సందర్భంలో ఇద్దరూ కలిసి ఫొటో దిగినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు.

ఇలా అనుకున్న ప్రతిసారి అది మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది, ఫ్యాన్స్ కొట్టుకోవడం తిరిగి మొదలవుతోంది. ఈసారి వివాదం రాజకీయ రంగు పులుకుమున్న సంగతి తెలిసిందే.

ఏపీ ఎన్నికల్లో ఓవైపు హోరుగా జనసేన పార్టీ ప్రచారం చేస్తుంటే, మరోవైపు మెగాకాంపౌండ్ కు చెందిన బన్నీ జోరుగా నంధ్యాల వెళ్లి శిల్పాను కలవడం అత్యంత వివాదాస్పదమైంది. నాగబాబు లాంటి వాళ్లు బాహాటంగానే బన్నీపై విమర్శలు చేయగా, సాయిదుర్గతేజ్ లాంటి వాళ్లు అన్-ఫాలో కొట్టారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా బన్నీపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.

ఇలా ఇద్దరి మధ్య బంధం బీటలువారి, మరోవైపు ఫ్యాన్స్ రచ్చ పీక్ స్టేజ్ కు చేరిన టైమ్ లో.. పవన్ పై పాజిటివ్ గా స్పందించాడు బన్నీ. కల్యాణ్ గారిలో ధైర్యం అంటే తనకు ఇష్టమన్నాడు. “నాకు తెలిసిన వ్యక్తుల్లో చాలా డేరింగ్ పర్సన్. తన దారిలో తను వెళ్లిపోతాడు.” అంటూ పొగిడాడు.

దీంతో మరోసారి సోషల్ మీడియాలో సూక్తిముక్తావళి ఊపందుకుంది. హీరోలంతా ఒకటేనని, వాళ్లువాళ్లు కలిసిపోతారని, ఫ్యాన్స్ సోషల్ మీడియా యుద్ధాలు ఆపాలంటూ ప్రవచనాలు మొదలయ్యాయి.

అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తొలిగిపోవడానికి, ఫ్యాన్ వార్స్ ఆగిపోవడానికి ఈ స్టేట్ మెంట్ ఒక్కటే సరిపోదంటున్నారు చాలామంది, ఇంకేదో కావాలి. మంచి సందర్భం కలిసిరావాలి. ఆ మూమెంట్ కోసం అంతా వెయిటింగ్.

15 Replies to “పవన్ ను పొగిడిన బన్నీ.. గొడవలు తగ్గుతాయా?”

  1. Aayana yem chepte manakenduku. Vaalliddaru bagunte manakenduku. Yedo oka pedartham teesukuni manam tannukundam. Yendukante pani Leni mangalodu pilli bochhu goriginattu manaku pani leka vaalla Sanka naaaaa…….

  2. ఈ రోజుల్లో తల్లి కొడుకు, అన్నా చెల్లి మధ్యనే విబేధాలు వస్తున్నాయి.. వాటితో పోలిస్తే ఇది జుజుబీ

  3. అసలు గొడవలెక్కడున్నాయి..గొ డ్డ ళ్ళ భాష మాట్లాడుకోలేదు.ఆస్తుల కోసం కే సు లు పెట్టుకోలేదు.. అధికారం ఆస్తుల యావలేని మంచికుటుంబాలు..దు ర్మా ర్గ మే జీవితం అనుకునే వారి నుండి ప్రజలకు రక్షణ కోసం పవన్ పాలిటిక్స్ కు వచ్చారు

Comments are closed.