తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ రంగంలోకి దిగింది. విచారణ చేపట్టేందుకు తమకు గెస్ట్ హౌస్‌తో పాటు అందుకు తగ్గట్టు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతరత్రా పరికరాలను సమకూర్చాలని టీటీడీని సీబీఐ నేతృత్వంలోని సిట్ కోరింది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది, గొడ్డు కొవ్వుతో పాటు చేప నూనె కలిపారని నివేదికలో తేలిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. స్వయాన సీఎం అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదాస్పద ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన వ్యవహారంపై బాధ్యతా రాహిత్యంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎలా చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది.
ఈ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌కు బదులు, ఇద్దరు సీబీఐ అధికారుల నేతృత్వంలో సుప్రీంకోర్టు సిట్ వేసింది. ఇప్పుడా సిట్ విచారణ చేపట్టేందుకు తిరుపతి చేరుకుంది. తమకు వసతులు కల్పించాల్సిందిగా టీటీడీని కోరింది. అలాగే తమకు సహకారం అందించేందుకు మరో 30 మంది అధికారులు కావాలని సిట్ కోరింది. ఇందులో నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో పాటు మరికొందరు సిబ్బంది ఉండనున్నారు.
vc estanu 9380537747
next target ???? DR or YV?
దం మొ… ఎవ్వారం..