వైసీపీ యాక్టివిస్టుల‌పై కేసుల్లో కొత్త కోణం!

ఒక ప్రాంత పోలీసులు మ‌రో ప్రాంతానికి వెళ్లి వైసీపీ యాక్టివిస్టుల‌కు నోటీసులు ఇచ్చి, విచార‌ణ‌కు రావాల‌ని చెబుతున్నారు.

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసుల్లో కొత్త కోణాన్ని చూడొచ్చు. స్థానికంగా కేసులు పెట్ట‌డంతో పాటు సుదూర ప్రాంతాల్లో కూడా న‌మోదు చేసి, విసిగిపోయేలా తిప్పాల‌నే ఆలోచ‌న‌తో కూట‌మి ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌లో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై కేసులు పెట్టార‌ని అనుకుందాం. అదే వ్య‌క్తుల‌పై రాయ‌ల‌సీమ‌లో కూడా కేసులు న‌మోదు చేస్తున్నారు. ఇలా న‌మోదు చేయ‌డం ద్వారా రాష్ట్రంలోని ఒక మూల నుంచి మ‌రో మూల‌నున్న ప్రాంతానికి తిప్ప‌డం ప్ర‌భుత్వ వ్యూహంగా క‌నిపిస్తోంది.

తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్‌కుమార్‌పై క‌ర్నూలు పోలీసులు కేసు న‌మోదు చేయ‌డాన్ని ఉద‌హ‌రించొచ్చు. అలాగే క‌డ‌ప‌, అనంత‌పురం వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ జిల్లాల్లో కేసులు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

ఒక ప్రాంత పోలీసులు మ‌రో ప్రాంతానికి వెళ్లి వైసీపీ యాక్టివిస్టుల‌కు నోటీసులు ఇచ్చి, విచార‌ణ‌కు రావాల‌ని చెబుతున్నారు. అస‌లు త‌మ‌పై సుదూర ప్రాంతాల్లో కేసులు న‌మోదు చేయ‌డానికి కార‌ణాలేంటో తెలియ‌క మొద‌ట్లో వైసీపీ యాక్టివిస్టులు భ‌య‌ప‌డుతున్నారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత విష‌యం తెలుసుకుని షాక్‌కు గుర‌వుతున్నారు. దీని వెనుక మ‌రో కార‌ణం కూడా లేక‌పోలేదు. భ‌విష్య‌త్‌లో అధికార మార్పిడి జ‌రిగినా, కేసులు పెట్టి వేధించిన పోలీస్ అధికారుల‌కు ఇబ్బంది లేకుండా చేసే ఎత్తుగ‌డ‌లో భాగంగా చెబుతున్నారు.

6 Replies to “వైసీపీ యాక్టివిస్టుల‌పై కేసుల్లో కొత్త కోణం!”

  1. ఏ క్షణాన బులుగు మిత్రుడి కోసం చేసాడో…కేసులు మొదలు…ఇప్పుడు అరెస్ట్…బులుగు దరిద్రం మామూలుగలేదు

  2. వాళ్ళు అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టకుండా పోలీస్ లు arrest చేస్తే తప్పకుండ మీడియా కి వచ్చి వాళ్ళ సచ్చీలతను చూపితే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది ఎవరిని అక్రమం గ అరెస్ట్ చేసేరో చెప్పాలి కదా ఎదుటి కుటుంబాల మహిళలను దారుణం జి అవమానిస్తా పోస్ట్ లు పెడితే తోలు తీయాలి

    1. Sare raa puka,

      pattabhi gaadini first jail lo pettu…

      rrr gaadu next level ki vellavu…

      telangana Kris reddy gaadu help chesthe military flight lo paaripoyaadu

Comments are closed.