హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌కు బన్నీ వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఈ ఘటనపై అల్లు అర్జున్‌తో పాటు సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యజమాని, మిగిలిన సిబ్బందిని అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా వుండగా తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని బన్నీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు విచారణలో వుంది. తనకు, తొక్కిసలాటకు సంబంధం అల్లు అర్జున్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లి, తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమయ్యారని పోలీసులు అంటున్నారు. అందుకే ఆయన్ను అరెస్ట్ చేశారు.
మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారాన్ని బన్నీ ప్రకటించారు. అలాగే తొక్కిసలాటలో గాయపడ్డ వారి కుమారుడి చికిత్స ఖర్చును తానే భరిస్తానని అర్జున్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏ క్షణాన బులుగు మిత్రుడి కోసం చేసాడో…కేసులు మొదలు…ఇప్పుడు అరెస్ట్…బులుగు దరిద్రం మామూలుగలేదు
రకుల్ రావు కి ఇది పాలకుల అభద్రత భావం అంట. అదే నీ ప్రభుత్వం ఐతే చక్కగా ‘రాజీ’ పడేవాడివి. నీకు ‘ కావలసినవి ‘ ఆఫర్ చేసేవారు.
Mana lawyer niranjan Reddy anta … Ekkado vinnattu vundhi
పది రూపాయలు విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ను 11 రూపాయలకు కూడా కొనను అని అన్నవాడు ఇప్పుడు ఒకవైపున రేవతి గారి చావుతో తనకు సంబంధం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ, మరోవైపు ఆమె కుటుంబానికి పాతిక లక్షలు ఇస్తానని, వైద్య ఖర్చులు కూడా భరిస్తానని ఎలా చెబుతున్నాడు? ఆమె మరణం వెనుక తన తప్పు ఉందని తనకు బాగా తెలుసు. Point to be noted your honour.
Allu aravindh good family
Pushpa 2 movie blockbuster hit