పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నా, ఏం ప్రయోజనం లేదనే తీవ్ర అసంతృప్తి టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంది. టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని తపించి, కష్టపడి పని చేసిన వాళ్లకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదనలో వాళ్లలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మూడు దఫాలుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయ్యింది. పని చేసినోళ్లకు కాకుండా మరెవరికో పదవులు దక్కాయనే ఆవేదనలో వాళ్లలో వుంది.
టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో పదవులు రాలేదన్న అసంతృప్తి వుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎట్టకేలకు అంగీకరించారు. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగిందని నాయకులు, కార్యకర్తల్లో వుందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు పార్టీ కోసం పని చేసిన వాళ్లకే నామినేటెడ్ పదవుల కోసం సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అసలు ప్రభుత్వంలో ఎవరికి పనులవుతున్నాయో, ఏం జరుగుతున్నదో తెలియదన్న అసంతృప్తి టీడీపీ కేడర్‌లో బలంగా వుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రెండు రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాస్తవాల్ని టీడీపీ కేడర్ ఆయన దృష్టికి తీసుకెళుతున్నారు. మరీ ముఖ్యంగా పొత్తు కారణంగా బలమే లేని జనసేన, బీజేపీకి చెందిన అనామకులకు పదవులు వచ్చాయని, తమకు విలువే లేకుండా పోయిందనే ఆవేదనను పల్లా ఎదుట గోడు వెల్లబోసుకోవడం గమనార్హం.
వైసీపీ ఘోర పరాజయానికి కారణం… ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి. పార్టీ అధికారంలో ఉన్నా, తమను పట్టించుకోలేదన్న ఆవేదన… ఎన్నికల నాటికి ఆగ్రహంగా మారింది. ఐదేళ్ల అధికారంలో న్యాయం జరగడం పక్కన పెడితే, అన్యాయం జరిగిందన్న అక్కసుతో పార్టీకి వ్యతిరేకంగా చేశారు. అందుకే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్‌లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీన్ని ఆ పార్టీ అధిగమించే దాన్ని బట్టి, టీడీపీ భవిష్యత్ ఆధారపడి వుంటుంది. ప్రస్తుతానికైతే టీడీపీ కేడర్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనేందుకు… పల్లా శ్రీనివాస్ మాటలే నిదర్శనం.
జాతకాల్లో రాజయోగం అని ఉందంటే వాళ్ళందరూ రాజులైపోవాలనుజునుంటే ఎలా…వాళ్ళకి పరి బహమున్న సమాజం లొంకాష్ఠ గుర్తింపులోకిణ్వస్తారు అని మాత్రమే అనుకోని సర్దుకోవాలి
జాయిన్ అవ్వాలి అంటే
నిప్పు అయినా బయటికి వచ్చిన నిప్పు అయినా ఒకటే అది నాయకుల పార్టీ అంతర్గత వ్యవహారం. మధ్యలో నీకెందుకు గుద్దని వచ్చింది రా గ్యాస్ ఆంధ్ర వైసీపీ ఎందుకు ఓడిపోయింది రా అంటే ఒక్కటి కూడా నేటికీ సరి అయిన సమాధానం చెప్పడం లేదు అందరూ అతుకుల బొంత సమాధానం చెప్పే వాళ్ళే కానీ కరెక్ట్ గా చెప్పే మొగోడు ఒక్కడు దొరకలే ఇంతవరకు. ముందు వైసీపీ వారు ఎందుకు ఓడిపోయారు కారణం కనుక్కో తర్వాత మిగిలినవి చూద్దాం గాని. నీకు ఎవరి మీద ఒకరి మీద పడి ఏడవకపోతే ఆరోజు తిన్నది అరగదేమో నీకు గ్యాస్ ఆంధ్ర. నువ్వు చెప్పు గ్యాస్ ఆన్ రా సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి ఆయన సంక నాకుతున్నావు కదా ఎందుకు ఓడిపోయా రో నువ్వు చెప్పు గ్యాస్ ఆంధ్ర
హాయ్