ఓదెల 2… అరుంధతి 2

ట్రయిలర్ చూడగానే మళ్లీ మరోసారి అరుంధతి గుర్తుకువచ్చింది. దీనికి కారణాలు రెండు.

ఒకప్పటి బ్లాక్ బస్టర్ అరుంధతి. ఆ తరువాత చాలా హర్రర్ సినిమాలు వచ్చాయి కానీ అరుంధతి మాత్రం ఓ మైల్ స్టోన్ లా అలా వుండిపోయింది. వచ్చేవారం విడుదలవుతున్న ఓదెల 2 ట్రయిలర్ వచ్చింది. ట్రయిలర్ చూడగానే మళ్లీ మరోసారి అరుంధతి గుర్తుకువచ్చింది. దీనికి కారణాలు రెండు.

ఒకటి ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం. రెండోది అరుంధతిలో మాదిరిగానే హీరోయిన్ చేత బలమైన డైలాగులు చెప్పించడం. అన్నింటికి మించి మాంచి దుష్టశక్తికి శివశక్తికి నడుమ ఫైట్ అన్నది దానికి వాడిన విజువల్స్ అన్నది ఈ పోలికకు రీజన్ అవుతోంది.

ఓదెల రైల్వే స్టేషన్ అంటూ చిన్న సినిమాను ముందుగా అందించిన దర్శకుడు సంపత్ నంది, ఈసారి దాని కొనసాగింపును మాత్రం చాలా భారీగా టేకప్ చేసారు. దాదాపు పాతిక కోట్ల మేరకు చేసిన ఖర్చు ట్రయిలర్ లో కనిపిస్తోంది. హర్రర్ సినిమాకు డివోషనల్ టచ్ ఇవ్వడంతో ట్రయిలర్ కు క్రేజీ పాయింట్ గా మారింది. భూమాత మీద గోమాత మీద వేసిన డైలాగు బలంగా పేలింది.

ఇప్పటి వరకు ఓదెల2 ను జస్ట్ ఓ హర్రర్ సినిమాగా మాత్రమే చూసారు. కానీ ట్రయిలర్ ఆ లుక్ ను మార్చింది. ట్రయిలర్ లో తమన్నా ఈ క్యారెక్టర్ కు పెర్ ఫెక్ట్ ఫిట్ అన్నట్లుంది. విజువల్స్ కు తగినట్లు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కుదరడం ప్లస్ అయింది.

9 Replies to “ఓదెల 2… అరుంధతి 2”

    1. నాకు కూడా అదే అనుమానం వచ్చింది సార్, ఈ ట్రైలర్ అంతా కూడా తమిళ్ లో ఖుష్బుగారి భర్త సుందర్ గారు తీసే చీప్ గ్రాఫిక్ హర్రర్ మూవీ లానే వుంది

Comments are closed.