రిలీఫ్ టెంపరరీనే! పరువు, కెరీర్ గోవిందా!!

హైకోర్టు ఆదేశాలు.. కిరణ్ కు చిన్న ఉపశమనం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక మహిళను లైంగికంగా వేధించడం మాత్రమే కాదు, ఆమె నుంచి కోట్లలో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మీద పోలీసు కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మీద లైంగిక వేధింపులు అత్యాచారం కేసుల సంగతి తేలేవరకు, పార్టీనుంచి దూరం పెడుతున్నట్టుగా పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు.

అయితే ఈ కేసుల విషయంలో కిరణ్ కు చిన్న ఉపశమనం లభించింది. ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ కు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉపశమనం ఆయనకు తాత్కాలికంగా ఉపయోగపడుతుందేమో గానీ.. ఆయన పరువు, రాజకీయ కెరీర్ రెండూ కూడా గోవింద కొట్టినట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

కిరణ్ రాయల్ ఒక మహిళను లైంగికంగా వేధించడం మాత్రమే కాదు, ఆమెనుంచి 1.20 కోట్లరూపాయల డబ్బు, బంగారు నగలు కూడా తీసుకున్నట్టు ఆమె పోలీసు కేసు పెట్టారు. అయితే కిరణ్ రాయల్ జనసేన పార్టీకి తిరుపతిలో కీలక నాయకుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. అదే సమయంలో కేసు నమోదు చేసిన యూనివర్సిటీ పోలీసులు విచారణకు రావాల్సిందిగా కిరణ్ రాయల్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు హైకోర్టులో చిన్న రిలీఫ్ దొరికింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అయితే ఈ హైకోర్టు ఆదేశాలు.. కిరణ్ కు చిన్న ఉపశమనం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్బు తీసుకోవడానికి సంబంధించి, లైంగిక బంధం గురించి రకరకాలుగా ఆయన బుకాయిస్తున్నారు. అయితే ఈలోగా.. ఫిర్యాదు చేసిన మహిళతో మాట్లాడిన ఆడియోలు బయటకు వస్తున్నాయి. ఆ ఆడియోలలో తనకు లేడీస్ వీక్ నెస్ ఉన్నదని, చచ్చేదాకా అమ్మాయిల వీక్ నెస్ వదులుకోలేనని కిరణ్ రాయల్ పచ్చిగా చెప్పడం ఒక ఎత్తు.. ఇదంతా ఆయన పరువు సమూలంగా నాశనం చేసేలా ఉంది.

అదే సమయంలో.. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ 20 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని డిమాండ్ చేశారని, తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో టికెట్ తనకు ఇవ్వడం లేదని, పార్టీ గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టు ఇస్తారని చెప్పుకోవడం.. జనసేన పార్టీ పరువును, పవన్ కల్యాణ్ పరువును కూడా దారుణంగా నాశనం చేసింది. పార్టీ పరువు తీసేలా ఇలాంటి మాటలు మాట్లాడినందుకు పవన్ కల్యాణ్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.

ఈ దెబ్బతో.. జనసేన పార్టీతో కిరణ్ రాయల్ అనుబంధం తెగుతుందని.. రాజకీయంగా ఆయనకు కెరీర్ ఇంకా మిగిలుందని అనుకోవడం కూడా భ్రమ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

8 Replies to “రిలీఫ్ టెంపరరీనే! పరువు, కెరీర్ గోవిందా!!”

      1. కాదు నన్ను కొడి కత్తితో పొడిచి చంపారు అని చెప్పి అయిదు ఏళ్ళు సాక్షం చెప్పలేనోడు హీరో, సింహం, పులి

  1. అదేందయ్యో గంట అరగంట అన్నోడు మంత్రి. సంజన అన్నోడు మంత్రి.నగ్న వీడియోలు చేసినోడు ఎంపీ. కాని ఇతినికి మాత్రమె పరువు పోయింది….మిగితా వాళ్ళ పరువు వెలిగిపోయింది

Comments are closed.