కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ కారణాలతో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారనే విమర్శల గురించి తెలిసిందే. అయితే టీడీపీ సీనియర్ నాయకుడి ఇంటిని పడగొట్టాల్సిందే అంటూ మహిళా ఎమ్మెల్యే పంతం పట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది.
టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి స్వస్థలం ఆళ్లగడ్డ. ఏవీకి ఆళ్లగడ్డలో సొంత ఇల్లు, స్థలాలున్నాయి. నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం నివాసం వుంటున్నప్పటికీ, స్వస్థలానికి వెళ్తుంటారు. ఏవీ ఉనికిని జీర్ణించుకోలేని మహిళా ఎమ్మెల్యే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయనపై కక్షపూరిత చర్యలకు దిగాలని శ్రీకారం చుట్టారు. ఆళ్లగడ్డలో ఏవీని అడుగు పెట్టనివ్వకూడదని సదరు ఎమ్మెల్యే పట్టుపట్టారు.
రెండు రోజులుగా ఆళ్లగడ్డలోని తన ఇంట్లో ఏవీ సుబ్బారెడ్డి వుంటున్నారు. ఈ విషయం తెలిసి మహిళా ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని తెలిసింది. ఆళ్లగడ్డలో ప్రధాన వీధిలో శివాలయం దగ్గరగా వున్న ఏవీ ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి నిర్మించారని, దాన్ని కొట్టేయాలనేది సదరు మహిళా ఎమ్మెల్యే డిమాండ్. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే తన ఇంటికి సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నాయని, పైగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్టు ఏవీ చెప్తున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఏవీ ఇంటి వెనుకాల మహిళా ఎమ్మెల్యే తిష్టవేసి, ఇంటిని పడగొట్టాలనడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ నుంచి వెళ్లాలనే హక్కు తమకెక్కడిదని ఇటీవల కొత్తగా వచ్చిన డీఎస్పీ అంటున్నారని సమాచారం. అయితే ఇంటిని పడగొట్టాలంటూ ఆమె భీష్మించడంతో బుధవారం ఉదయం నుంచి ఆళ్లగడ్డలో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మరోవైపు సొంతూళ్లో ఉండడానికి ఎమ్మెల్యే అనుమతి అవసరం లేదని ఏవీ వాదన. ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో పోలీసు, మున్సిపల్ అధికారులు నలిగిపోతున్నారు. అయితే ఆళ్లగడ్డలో ఉండడానికి ప్రజాప్రతినిధి తన అనుమతి వుండాలనే ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారికి లేని గుద్ధ నొప్పి నీకెందుకంట గ్యాస్ ఆంధ్ర .
సొంత పార్టీ నేతలే కదా వాళ్లకు వాళ్లు సర్దుకుంటారులే మధ్యలో నువ్వు కాలు వేలు పెట్టకుండా ఉంటే అదే పదివేలు గ్యాస్ ఆంధ్ర
Ayo