రెడ్​ బుక్​.. పింక్​ బుక్.. ఆరెంజ్​ బుక్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పకోవచ్చు.

మనకు టెక్స్ట్ బుక్స్​ తెలుసు. నోట్​ బుక్స్​ తెలుసు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్​ బుక్స్​​ ట్రెండ్​ నడుస్తోంది. వీటిని ప్రతీకార పుస్తకాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలో రెడ్ బుక్ రాజకీయాలు నడుస్తుంటే… తెలంగాణలో పింక్ బుక్​ ఓపెన్​ చేసి కాంగ్రెసు ప్రభుత్వ పాపాల చిట్టా రాస్తామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆ మధ్య చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణ లో పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం” అని హెచ్చరించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. దీనికి ఖచ్చితంగా వడ్డీ చెల్లించుకుంటామని.. ఎవర్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని విమర్శలు చేస్తుంటారు, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడు అని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినందుకు కూడా కేసులు పెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుపై కవిత స్పందించారు. ” బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో మూడు కొత్త బిల్లులు రూపొందించాలని, విద్య, ఉద్యోగాలు మరియు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని, విద్యలో 46శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాలలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు, స్థానిక ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంకొక బిల్లు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్​ అయితే కిందా మీదా నిలవడంలేదు. ఐదారు నెలల్లోనే కాంగ్రెసు ప్రభుత్వం పడిపోతుందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అన్నాడు. అదెలా జరుగుతుందో ఆయనకే తెలియాలి. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​ మరో అడుగు ముందుకేసి ఆరెంజ్​ బుక్​ అంటే కాషాయం బుక్​ రెడీ చేస్తున్నామని చెప్పారు.

తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు. ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేది 35 ఏళ్లు అని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎంతోమంది ఉద్దండులను తాము చూశామన్నారు. ఐఏఎస్ లు బానిసల్లా పని చేయొద్దని, గతంలో అలా పని చేసిన వారు జైలు పాలయ్యారని హెచ్చరించారు.

ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికి అనుగుణంగా పనితీరు ఉంటుందని, సీఎంతో పాటు వారి బంధు మిత్రుల ఒత్తిడికి తలొగ్గదని ఆయన సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ లను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. బాసుల ఆదేశాలు పాటించడం కాకుండా నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

మేము కూడా ఆరెంజ్‌ బుక్ మెయింటేన్ చేస్తున్నామన్నారు. ఆ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నామన్న ఈటల.. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు ఈటల. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పకోవచ్చు.

8 Replies to “రెడ్​ బుక్​.. పింక్​ బుక్.. ఆరెంజ్​ బుక్!”

  1. మీ జగన్ రెడ్డి కూడా నీలి బుక్కు రాసుకొంటున్నాడు కదా..

    ..

    ఆల్రెడీ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి..

    గోరంట్ల మాధవ్

    అనంత బాబు

    ..

    ఇంకో ముగ్గురు లైన్ లో ఉన్నారు..

    వల్లభనేని వంశి..

    కొడాలి నాని..

    దేవినేని అవినాష్..

    ..

    మీ జగన్ రెడ్డన్న నీలి లైబ్రరీ ఇది.. పాలస్ లో ముత్యాల చెమ్మా చెక్కా..

  2. ఈ లిక్కర్ ముంజ ని ఎయిడ్స్ వచ్చినరోగులతో రేప్ చేయించాలి ..ముంజ APప్రజల్ని ఎన్ని తిట్లు తిట్టింది ముంజ…

    bokkalovesi kaarampettali eemunjaki

Comments are closed.