తిరుమల శ్రీవారి ఆలయంలో మహాద్వారం నుంచి తనను బయటికి పంపడానికి నిరాకరించిన ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేశ్‌కుమార్ నోరు పారేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. టీటీడీ బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేయడం గమనార్హం. ఇప్పుడు ఒక ఉద్యోగిపై అవాకులు చెవాకులు పేలిన టీటీడీ బోర్డు సభ్యుడితో రాజీనామా చేయించాలని ఉద్యోగ సంఘాల నాయకుల డిమాండ్ ఆహ్వానించదగ్గదే.
అయితే ఉద్యోగ సంఘాల్లో ఇదే చొరవ ఇంతకు ముందే వుండింటే…. ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో, టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనే పేరుతో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల్ని భారీ సంఖ్యలో రంగంలోకి దింపారు. టీటీడీ ఉద్యోగులు, అలాగే ఫైనాన్ష్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ (ఎఫ్ఏఅండ్‌సీవో) బాలాజీ తదితరుల్ని ఆధ్మాత్మిక సంస్థతో పాటు రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు నోటీసులు ఇచ్చి, భయకంపితుల్ని చేశారు.
రోజుల తరబడి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చారు. దీంతో కొందరు ఉద్యోగులు సెలవుపై వెళ్లారు. మరికొందరు అనారోగ్యంబారిన పడ్డారు. విజిలెన్స్ అధికారుల తీరుతో తమకు ఏమవుతుందో అని ఆందోళనకు గురయ్యారు. వందలాది మంది ఉద్యోగుల్ని ప్రభుత్వం వేధిస్తున్నప్పుడు టీటీడీ ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. తమకు సంబంధం లేని వ్యవహారంగా టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో, భయంతోనో లేదా అధికార పార్టీ నేతలపై భక్తితోనో టీటీడీ సంఘాల నేతలు నోరు మెదపలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో తొమ్మిది నెలలకే రాజకీయ మార్పుతో టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలకు ధైర్యం వచ్చినట్టుందని ఉద్యోగులు అంటున్నారు. తమను ముప్పుతిప్పలు పెట్టేటప్పుడు, ఇప్పుడు నోళ్లు తెరుస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు తమాషా చూశారని కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పుడు మహాద్వారం వద్ద బాలాజీ అనే ఉద్యోగిని ఇబ్బంది పెట్టారనే కారణంతో అయినా, ఉద్యోగ సంఘాల నాయకుల్లో పౌరుషం రావడం మంచిదే అంటున్నారు. తమకు బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడ్డం కాకుండా, ఉద్యోగుల్ని ఏ కారణంతో వేధించినా స్పందించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు వారు హితవు చెప్తున్నారు.
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల వుంటే ఎప్పుడన్నా ఉద్యమాలు చేశారా ..?
అన్యమతస్థుల నూ ఛైర్మెన్ లు గా చేస్తుంటే ఇదీ అన్యాయం అనీ అప్పుడు అరవని నోర్లు ఈ ప్రభుత్వం లోనే ఎందుకూ లేస్తున్నాయి….
వై ?