అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, కేంద్రమైనా కావచ్చు. వస్తున్న ఆదాయం నుంచి లేదా చేస్తున్న అప్పుల నుంచి పెట్టే ఖర్చు అన్నది రెండు రకాలుగా వుంటోంది. ఒకటి తప్పని సరి ఖర్చు. రెండు జనాలకు పంచే ఖర్చు. ఈ తప్పని సరి ఖర్చు అనేది ఉద్యోగుల జీత భత్యాలు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఖర్చులు, నిర్వహణ ఖర్చులు వుంటాయి.
రెండోది సంక్షేమం పేరుతో జనాలకు పంచే ఖర్చులు. ఇవి కాక మూలధన వ్యయం. ఇదే కీలకం. అంటే పెట్టుబడి వ్యయం. ఏదైనా స్థిరమైన పనులు చేయడానికి, ప్రగతి కారకమైన పనులు చేయడానికి చేసే వ్యయం ఇది. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ పెట్టుబడి వ్యయం తగ్గిపోతోంది. రెవెన్యూ వ్యయం పెరిగిపోతోంది. ముఖ్యంగా జీతాలు, పింఛన్లు అన్నవి గుదిబండగా మారుతున్నాయి. జీతాలతో సమానంగా పింఛన్ల వ్యయం వుంటోంది.
ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఏ వ్యయం ఎలా వుంటోంది అన్నది చూద్దాం.
కేవలం నిర్వహణ, అప్పుల మీద వడ్డీలకే 43 పైసలు ఖర్చయిపోతోంది. మిగిలిన 57 పైసల్లో సంక్షేమ కార్యక్రమాలకే 18 పైసలు ఖర్చయిపోతోంది. అంటే ఇక మిగిలింది 39 పైసలు ఇవి మాత్రమే వివిధ శాఖలకు సర్దుబాటు చేయాలి. వాటిల్లొ కూడా ఆయా శాఖల ఖర్చులు వుంటాయి. బడ్జెట్ మూడు లక్షల పై చిలుకు అంటే అందులో లక్షా ఇరవై వేల కోట్లు మాత్రమే వివిధ శాఖలకు అందేవి. మిగిలినంతా తప్పనిసరి వ్యయంగానే పోతుంది.
బడ్జెట్ ఎంత పెరుగుతున్నా, ప్రయోజనం ఏముంది? అసలు ఈ భారీ వ్యయం దృష్ట్యానే బడ్జెట్ సైజ్ పెంచాల్సి వస్తోంది. ఎందుకంటే వచ్చిన రూపాయి వచ్చినట్లు ఖర్చు పెడితే ఏమీ ఉండదు. అందువల్ల రూపాయికి రూపాయి అప్పు చూపించి, రెండు రూపాయిల్లో ఒక రూపాయి అభివృద్ధి, సంక్షేమం అన్నట్లు ప్రొజెక్ట్ చేయాల్సిందే ఏ ప్రభుత్వం అయినా కూడా. ఈ తీరు మారడం కష్టం. జనాలపై భయంకరంగా పన్నులు వేసేస్తే తప్ప.
అంటే మిగిలేది పావలా నా ?
Avunu