పేరుకే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు. పవర్ మాత్రం యువ నాయకుడైన చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేతిలో వుంది. ఇది బహిరంగ రహస్యం. టీడీపీ నేతల్ని ఎవర్ని అడిగినా ఇదే మాట చెప్తారు. ఏంటో ఈ దఫా పరిపాలనలో చంద్రబాబు మార్క్ అనేది అసలు కనిపించడం లేదని స్వపక్షీయుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట. అంటే, పాలనలో స్పష్టమైన తేడాను టీడీపీ కార్యకర్త మొదలుకుని ఎమ్మెల్యేలు, మంత్రుల వరకూ అందరూ గుర్తించారు.
ఈ నెల 12వ తేదీకి చంద్రబాబు ప్రభుత్వం 9 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పార్టీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తాజాగా చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కేడర్‌తో గ్యాప్ పెరుగుతోందన్నారు. ఇలాగైతే రాజకీయంగా దెబ్బతింటామన్నారు. ఇప్పటి నుంచి రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయమై నేరుగా హెచ్చరిక చేశారు. టీడీపీ కేడర్‌లో అసంతృప్తి వుందని ఆయన గుర్తించారు.
తొమ్మిది నెలల్లోనే చంద్రబాబు వాస్తవాల్ని గ్రహించడం అభినందనీయం. ఎందుకంటే రోగం ఏంటో తెలిస్తే, మందు వేయొచ్చు. రోగమే లేదని అనుకుంటే, చేయగలిగేదేమీ లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ కేడర్‌లో తీవ్రమైన అసంతృప్తి వుందని చంద్రబాబు గ్రహించడం ఆయన అనుభవాన్ని తెలియజేస్తోంది, అయితే ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చాలా వరకూ చేయిదాటి పోయారు.
ఇక ఆయన చేయగలిగేది కూడా ఏమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఇప్పుడు చంద్రబాబు వర్గంగా కంటే, లోకేశ్ సన్నిహితులుగా గుర్తింపు పొందడానికే టీడీపీ మెజార్టీ నేతలు ఇష్టఫడుతున్నారు. చంద్రబాబుకు వయసు పైబడుతున్న రీత్యా, ఇక లోకేశ్‌దే పెత్తనం అంతా అని నాయకులు గ్రహించారు. అందుకే టీడీపీలో లోకేశ్ వర్గం బలంగా వుందన్నది కాదనలేని వాస్తవం. లోకేశ్ టీమ్ అంటే, ప్రస్తుత విలువల్లేని తరానికి ప్రతినిధులనడం కఠిన చేదు నిజం. రాజకీయాలు అంటేనే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే లోకేశ్ వర్గంగా గుర్తింపు పొందితే, పది రూపాయిలు సంపాదించుకోవచ్చనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వుంది. తన వర్గమైతే చాలు.. లోకేశ్ ఎలాంటి వాళ్లనైనా వెనకేసుకొస్తారనే అభిప్రాయం పార్టీలో బలంగా వుంది. పైగా లోకేశ్ డబ్బు మనిషి అని, ఆయన్ను మేనేజ్ చేయొచ్చనే టీడీపీ నేతల ఆరోపణల్లో నిజానిజాల సంగతి వాళ్లకే తెలియాలి. కానీ అలాంటి ఆరోపణను కొట్టి పారేయలేం. తొమ్మిది నెలల్లోనే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోందని చంద్రబాబు అంటున్నారు. కొందరిపై మాత్రం తక్కువ ఆరోపణలున్నాయని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.
చంద్రబాబు మందలిస్తే, ప్రభుత్వంలోనే ఆశ్రయం ఇవ్వడానికి తన కుమారుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం గుర్తిస్తున్నారా? లేదా? అనే అనుమానం. ముందు తన కుమారుడి నుంచి ప్రక్షాళన మొదలు పెడితే అన్నీ చక్కబడుతాయి. అలాంటి పరిస్థితి లేదన్నది జగమెరిగిన సత్యం. అందుకే చంద్రబాబు చేయిదాటిపోయారని చెప్పడం. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ప్రతి అధికార పార్టీ ప్రతినిధి వెంపర్లాడుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోవడమే దీనంతటికి కారణం. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఉద్ధరించాలని చంద్రబాబు అనుకున్నా, ఇప్పుడు అదంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. “చానా ముదుర్లు” లోకేశ్ చుట్టూ ఉన్నప్పటికీ, ఏమీ తెలియని అమాకుడిగా చంద్రబాబు నటించడం ఏంటో అని టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నించడం ఆలోచింపజేస్తోంది.
Chala kashtapadi pedda theory rasav gani…time and energy waste neeku. Mee tikkalodu power loki vastadani kallo kuda anukoku
ముందే అనుకున్నదే…దానికి pk వంత.
కొడుక్కి అధికారం దక్కేలా అన్ని అడుగులు వేసేస్తున్నాడు…ముఖ్యంగా ఇలాంటి మీడియాల సాయం ప్రధానంగా వాడుకుంటూ..
అలా ఎలా ముందే అనుకున్నారు? నోస్ట్రడామస్, బ్రహ్మం గారిని మించిపోయారు
అవునా.. అలాగా?? సర్లే ప్యాలెస్ పోయి 11 పైసల్ తీసుకో పో..
ఏమో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టు, తన కొడుకు తనకు వెన్ను పోటు పొడుస్తాడేమో ఎవరు చూశారు.
Avunu nijam