కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. నూతన టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఇవాళ టికెట్లను జారీ చేసింది.
తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ కమ్యూనిటీ హాల్లో దర్శన టికెట్ల జారీని ప్రారంభించారు. మహతి ఆడిటోరియంలో 2,500, తిరుమలలో 500 టికెట్లను తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకూ జారీ చేయడం విశేషం.
మహతి ఆడిటోరియం వద్ద చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామన్నారు. ఇవాళ స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం పునరుద్ధరణ జరిగిన శుభదినం అన్నారు.
తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తమ నియోజకవర్గాల పరిధిలోని భక్తులకు ప్రతి మంగళవారం ఉచిత దర్శనం కల్పించాలనే నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు తదితరులు పాల్గొన్నారు.
Call boy jobs available 7997531004