నందమూరి మోక్షు-వెంకీ అట్లూరి

నందమూరి మోక్షజ్ఙ తొలి సినిమా ఈ నెల అయిదు నుంచి ప్రారంభం కాబోతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఇదిలా వుండగానే రెండో సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. సర్..లక్కీ భాస్కర్ లాంటి వైవిధ్యమైన సినిమాలు…

నందమూరి మోక్షజ్ఙ తొలి సినిమా ఈ నెల అయిదు నుంచి ప్రారంభం కాబోతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఇదిలా వుండగానే రెండో సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. సర్..లక్కీ భాస్కర్ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన వెంకీ అట్లూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అనౌన్స్ మెంట్ రాదు కానీ కాంబినేషన్, ప్రొడక్షన్ అంతా ఫిక్స్ చేసి వుంచుకున్నారు.

ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమా అందించిన వెంకీ అట్లూరి మళ్లీ అలాంటిదే వైవిధ్యమైన మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకుని హీరో కోసం చూస్తున్నారు. ఈసారి కూడా వింటేజ్ టచ్ సినిమానే వుంటుంది. ఇతర భాష హీరోనే చేస్తారు. అయితే అదంతా ఇంకా ఫైనల్ కావాల్సి వుంది. ఆ సినిమా తరువాత మోక్షజ్ఙ సినిమా ఫిక్స్ చేసుకున్నారు.

నిజానికి మొదటి సినిమానే సితార బ్యానర్ లో వుంటుంది అనుకున్నారు. కానీ సుధాకర్ చెరుకూరి దగ్గరకు వెళ్లింది. ప్రశాంత్ వర్మ డేట్ లు అక్కడ వున్నాయి కనుక. అందువల్ల రెండో సినిమా చాన్స్ సితార బ్యానర్ కు వచ్చింది. ప్రస్తుతం ఇదే బ్యానర్ తో బాలయ్య డాకూ మహరాజ్ సినిమా రెడీ అవుతోంది.

2 Replies to “నందమూరి మోక్షు-వెంకీ అట్లూరి”

Comments are closed.