విశాఖను తలచుకున్న వెంకయ్యనాయుడు

తన రాజకీయ జీవితానికి బాటలు వేసింది విశాఖపట్నం అంటూ గతాన్ని గట్టిగా తలచుకున్నారు భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. విశాఖలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో తన…

తన రాజకీయ జీవితానికి బాటలు వేసింది విశాఖపట్నం అంటూ గతాన్ని గట్టిగా తలచుకున్నారు భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. విశాఖలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో తన విద్యార్ధి జీవితం గడచింది అని అన్నారు. అప్పట్లో రాజకీయ ప్రముఖులు అయిన తెన్నేటి విశ్వనాధం వంటి వారితో పరిచయాలు ఏర్పడడం తన రాజకీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఎన్నాళ్ళు బతికాం అన్నది కాదు ఏమి సాధించామన్నది ముఖ్యమని ఆయన అన్నారు. యువత తమ సమయంలో కొంత సామాజిక సేవకు వినియోగించాలని ఆయన సూచించారు. ఆ విధంగా ప‌ది మందికి పాటు పడాలని ఆయన కోరారు. వెంకయ్యనాయుడు విశాఖకు తరచూ వస్తూంటారు.

ఆయన ఇక్కడే ఏయూలో న్యాయ విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అప్పట్లో ఎంతో మంది విశాఖలో రాజకీయ దిగ్గజాలు ఉండేవారు. వారి గురించి వీలైనప్పుడల్లా విశాఖ సభలలో వెంకయ్యనాయుడు చెబుతూ ఆ విధంగా ఆయన తన గతాన్ని విశాఖను తలచుకుంటూంటారు.

విశాఖ నుంచి ఎంతో మంది స్పూర్తి పొంది రాజకీయాల్లో గొప్ప స్థానాలు అందుకున్నారు. వారిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు, జీఎంసీ బాలయోగి వంటి వారు కూడా ఉన్నారు. వెంకయ్యనాయుడు అందరిలో ముందు వరసలో ఉంటారు.

4 Replies to “విశాఖను తలచుకున్న వెంకయ్యనాయుడు”

Comments are closed.