పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్‌ నేత

విశాఖ జిల్లాలోని సీనియర్‌ నేతలలో ఆయన ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1994లో టీడీపీ నుంచి అప్పటి విశాఖ ఒకటవ నియోజకవర్గం శాసససభ్యునిగా గెలిచిన డాక్టర్‌ ఎస్‌ఎ రహమాన్‌ మళ్లీ అసెంబ్లీ…

విశాఖ జిల్లాలోని సీనియర్‌ నేతలలో ఆయన ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1994లో టీడీపీ నుంచి అప్పటి విశాఖ ఒకటవ నియోజకవర్గం శాసససభ్యునిగా గెలిచిన డాక్టర్‌ ఎస్‌ఎ రహమాన్‌ మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. ఆయన అలా వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.

ఇక 1999లో టీడీపీ- బీజేపీ పొత్తు కారణంగా టిక్కెట్‌ దక్కలేదు. 2004లో కాంగ్రెస్‌ వేవ్‌లో ఓటమి చెందారు. 2009కి వచ్చేసరికి కొత్త నేతలు తయారై టిక్కెట్‌ దక్కలేదు. అలా ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, టీడీపీ, మళ్లీ వైసీపీ ఇలా అన్ని పార్టీలను చుట్టేశారు. అయినా పదవులు మాత్రం వరించలేదు.

2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉంటే ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని భావించారు. కానీ అదీ లేదు, దాంతో వైసీపీ నీడన చేరారు. వైసీపీలో కూడా అయిదేళ్ల పాటు ఏమీ దక్కలేదని వాపోయారు.

ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే హౌస్‌ ఫుల్‌గా ఉన్న టీడీపీలో ఆయనకు పదవులు దక్కడం అన్నది దుర్లభం అనే అంటున్నారు.

అయినా రాజకీయాలలో పొద్దు తిరుగుడు పువ్వులా పార్టీలను మారిన వారిలో కొందరికే అదృష్టం వరిస్తుందని కూడా గుర్తు చేస్తున్నారు.

4 Replies to “పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్‌ నేత”

  1. మరి ఇలాంటోళ్లను వెనుకేసుకొస్తూ మోసేస్తు ఎన్ని ఆణిముత్యాలు రాసారో గుర్తుందా

Comments are closed.