వ‌ద‌ల బొమ్మాళీ.. వ‌ద‌ల‌!

హామీల విష‌యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు మాట నిల‌బెట్టుకుంటార‌నే న‌మ్మ‌కం రోజులు గ‌డిచే కొద్ది త‌గ్గుతోంది.

హామీల విష‌యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు మాట నిల‌బెట్టుకుంటార‌నే న‌మ్మ‌కం రోజులు గ‌డిచే కొద్ది త‌గ్గుతోంది. ముఖ్యంగా స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు వార‌ధిగా నిలిచిన వ‌లంటీర్ల‌కు ఎన్నిక‌ల సంద‌ర్భంలో చంద్ర‌బాబునాయుడు వాళ్లు అడ‌గ‌కుండానే భారీ హామీ ఇచ్చారు. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌లంటీర్ల‌కు ప్ర‌తినెలా గౌర‌వ వేత‌నం కింద రూ.5 వేలు ఇచ్చేవారు.

తాము అధికారంలోకి వ‌స్తే, వ‌లంటీర్ల‌కు రెట్టింపు గౌర‌వ వేత‌నం అంటే రూ.10 వేలు చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు. ఎన్నిక‌ల్లో వాళ్ల ఓట్ల‌ను గంపగుత్త‌గా వేయించుకున్నారు. అలాగే వాళ్లిచ్చిన స‌మాచారంతో కూట‌మి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌లంటీర్ల వ్య‌వ‌స్థే లేద‌ని, ఇక దాన్ని ర‌ద్దు చేయ‌డం ఏంట‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. అలాగే ఆ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించే ఉద్దేశం లేద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు వివిధ వేదిక‌ల నుంచి తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాదిలో త‌మ‌కిచ్చిన హామీని సాధించుకునేందుకు వ‌లంటీర్లు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇందులో భాగంగా నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వలంటీర్లు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, వాళ్ల‌కిచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌నే డిమాండ్స్‌తో వినూత్న నిర‌స‌న కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టిన‌ట్టు స్టేట్ వ‌లంటీర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు జి.ఈశ్వ‌ర‌య్య తెలిపారు. ఈ నెల 2,3,4 తేదీల్లో వినూత్న నిర‌స‌న కార్యక్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

2న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల అడ్మిన్‌ల‌కు విన‌తుల ప‌త్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల‌పై భిక్షాట‌న‌, 4న సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెన‌క‌డుగు వేస్తున్నార‌ని తెలియ‌జేసేందుకు బ్యాక్ టు వాక్ పేరుతో వ‌లంటీర్లు నిర‌స‌న‌లు తెలుపుతార‌ని ఆయ‌న వివ‌రించారు. వ‌లంటీర్లను విడిపించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుంటే, మిమ్మ‌ల్ని వ‌ద‌ల బొమ్మాళీ అంటూ వాళ్లు వెంటాడుతున్నారు.

11 Replies to “వ‌ద‌ల బొమ్మాళీ.. వ‌ద‌ల‌!”

  1. గత అయిదు ఏళ్ళు ఉద్యోగ భద్రత అడగకుండా ఎం చేసినట్లు?ఇప్పుడు అసలు ఈ వొలుంటెర్ వ్యవస్తే ఆచరణలోనే లేదు…ఇంకా ఉద్యోగ భద్రత ఎలా ఇస్తారు?

  2. చంద్రిక , పావని లకు వాలంటీర్స్ ఉసురు ఎప్పుడు తగుల్తుందో ?

    1. ఫస్ట్ అయిదు కోట్ల ఆంధ్రుల ఉసురు తగిలోనిదిని గురించి ఆలోచిస్తే మంచిది

    2. ఎంత మంది వుసుర్లు తగిల్తే అలా ఐపోయారో పాపం.. పిచ్చోడు నిండా ముంచేశాడు.. వ్యవస్థ రద్దు చేసి, రాజీనామాలు చేయించి..

  3. ఒరేయ్… వాళ్ళని నువ్వు తప్ప ఎవడైనా డెకుతున్నాడా? ఎందుకంటా? వాళ్ళ బ్లాక్మెయిలింగ్ దారుణంగా ఉండేది.. అయినా ఎన్నికలకు ముందు వ్యవస్థని రద్దు చేసింది ఎవరు? రాజీనామాలు చేయించింది ఎవరు, చేసింది ఎవరు? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? వీళ్లంతా వెళ్ళి జగన్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలి.

  4. Chalu challe…Elections lo Evariki work chesaro andariki telsu kaani nvu kootami vijayaniki work chesaru ani rayadam navvu vastundi…tinadaniki kooda siggu anipinchatledha ilanti rathalu raste? Avnu le Siggu seram vadilesi nagnam ga tirigevadiki Ela matladina em nastam ledhu

      1. Istamannadu ga Wait cheyyamanu…cheyyanappudu adagamanu…Asalu Jagan gadu volunteers gurinche ea sandarbham lonu matladatledhu…em ee system techhindi aadega… enduku matladatledhu mari? Babu ni enduku qsn cheyyatledhu? Ee volunteers ki cheyyakapoyina ground level lo evaru peddaga qsn cheyyaru…anduke both govt & opposition silent ga vundhi…vellu kooda rendu moodu rojulu hadividi chestaru anthe…deeni valla evariki upayogam ledhu

          1. Mundu mana muddi manam kadukkovali…70+yrs vunna Ayani+present CM of AP ni nvu Babu ani ekavachanam tho pilavacchu…kaani jagan gadiki respect ivvali antunnav🙂mundu needhi ea stayi tho telsuko.. everyone deserves respect…not only who u adores/admires.

Comments are closed.