స‌ర్కార్‌ ఆయుష్షు త‌గ్గుతోంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

చేతిలో అధికారం ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలి. పుణ్య‌కాలం మించిపోక ముందే, చంద్ర‌బాబు స‌ర్కార్ మేల్కొనాలి.

కాలం ప‌రుగెత్తుతోంది. గ‌డియారం ముళ్లు ముందుకే త‌ప్ప‌, వెన‌క్కి తిర‌గ‌వు. క్యాలెండ‌ర్‌లో తేదీలు కూడా అంతే. అందుకే, స‌మ‌యాన్ని వృథా చేసుకోకూడ‌దు. ఒక్క స‌మ‌యం త‌ప్ప‌, ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవ‌ద్ద‌ని పెద్ద‌లు హిత‌వు చెబుతుంటారు. ఈ విష‌యాన్ని పాల‌కులు మ‌రీమ‌రీ గుర్తించుకోవాల్సి వుంటుంది. ఏ ప్ర‌భుత్వానికైనా ఐదేళ్లే పాల‌నా గ‌డువు.

ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందితే, మ‌ళ్లీ అధికారం ద‌క్కుతుంది. లేదంటే, క్యాలెండ‌ర్‌లో తేదీలు మారిన చందంగా, అధికార మార్పు త‌ప్ప‌దు. చంద్ర‌బాబు స‌ర్కార్ ఏడు నెల‌ల పాల‌న పూర్తి చేసుకోడానికి మ‌రో 11 రోజులు మాత్ర‌మే గడువు వుంది. నిన్న‌గాక‌, మొన్న ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ట్టుగా వుంది. అప్పుడే ఏడు నెల‌లైందా అధికారంలోకి వ‌చ్చి… ఇంకా ఏ ప‌నులూ చేయ‌లేదు, చేసుకోలేదు అని కూట‌మి నేత‌లు ఆశ్చ‌ర్యంతో అనుకునే ప‌రిస్థితి.

త‌మ ప్ర‌భుత్వ ఆయుష్షు త‌గ్గుతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ్ర‌హించాలి. అధికారంలో వుంటే, కాలం అస‌లు క‌నిపించ‌దు. బిజీబిజీ. ఇంకా వైసీపీ ప్ర‌భుత్వ పాపాల గురించే కూట‌మి స‌ర్కార్‌, టీడీపీ అనుకూల మీడియా మాట్లాడుతోంది, రాస్తోంది. త‌మ ప్ర‌భుత్వ పుణ్య కార్యాలే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతాయే త‌ప్ప‌, గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాల గురించి ప‌దేప‌దే చెప్ప‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని కూట‌మి పెద్ద‌లు తెలుసుకుంటే మంచిది.

ఎందుకంటే, గ‌త ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌డం వ‌ల్లే క‌దా కేవ‌లం 11సీట్ల‌కే ప‌రిమితం చేసింది. ఇంకా అయిపోయిన పెళ్లికి మేళాలెందుక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల గురించి రాస్తే… చేంతాడంత‌. చెప్పుకుంటే మ‌హాభార‌త‌మంత‌.

సూప‌ర్ సిక్స్ హామీలు, అలాగే సంప‌ద సృష్టిపై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. కానీ ఈ ఆరేడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో చెప్పుకోద‌గ్గ విశ్వ‌స‌నీయ‌త సాధించ‌లేద‌న్న‌ది చేదు నిజం. మీడియా బ‌లంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను క‌ప్పి పుచ్చుకుంటున్నారే త‌ప్ప‌, చేసిందేమీ లేదు. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. ప‌నులేవీ కావ‌డం లేద‌న్న‌ది వాళ్ల అసంతృప్తికి కార‌ణం.

కూట‌మి స‌ర్కార్ పాల‌నా రీతి చూస్తే, డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌తో కాలం నెట్టుకు రావాల‌నే అభిప్రాయం జ‌నంలో క‌లుగుతోంది. జ‌నం చాలా తెలివౌన వాళ్ల‌ని, ఎప్పుడెలా గుణ‌పాఠం చెప్పాలో బాగా తెలుస‌ని అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబుకు చెప్ప‌డం అంటే, తాత‌కు ద‌గ్గు నేర్ప‌డ‌మే అవుతుంది. అయితే హామీల్ని అమ‌లు చేయాలంటే, మంత్రం దండం త‌ప్ప‌, మ‌రో మార్గం లేదని ఒక సంద‌ర్భంలో ప్ర‌భుత్వ ప్ర‌ముఖుడెవ‌రో చెప్పిన‌ట్టు జ‌నం గుర్తించుకున్నారు. దీంతో హామీల అమ‌లుపై అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

క‌నీసం ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణానికి కూడా నెల‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎందుకింత కాల‌యాప‌న చేయాల్సి వ‌స్తున్న‌దో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కే తెలియాలి. ఉగాది నుంచి అమ‌లు చేస్తామ‌ని అంటున్నారు. అది కూడా ఆచ‌ర‌ణ‌కు నోచుకున్నంత వ‌ర‌కూ అనుమానమే.

మ‌రోవైపు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి వేల కోట్లు అప్పులు చేస్తూ, ఆ భారాన్ని రాష్ట్రం మొత్తంపై వేస్తున్నార‌న్న అసంతృప్తిని ప్ర‌భుత్వ పెద్ద‌లు గుర్తు పెట్టుకోవాలి. ఐదేళ్ల‌లో అమ‌రావ‌తిని నిర్మించుకుంటే చాలు అనే ఆశ‌యంతో ప్ర‌భుత్వం ముందుకు పోతోందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వ‌చ్చీ రాగానే ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాన్ని మోపారు. ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు దారి తీస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌, ఈ ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులేంటి? అనే సామాన్య ప్ర‌జానీకం ప్ర‌శ్న‌కు ఇంకా స‌మాధానం దొర‌క‌లేదు.

కానీ ప్ర‌భుత్వ ఆయుష్షు మాత్రం త‌రిగిపోతోంది. ఇదిగో, అదిగో అంటే ఈ ఏడాది కూడా ముగిసిపోతుంది. అధికారంలో ఉన్న‌వాళ్ల‌కు మాత్రం కాలం అస‌లు క‌నిపించ‌దు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా, దానిపై జీవించే మ‌న‌కు తెలియ‌న‌ట్టుగా, అధికారంలో ఉన్న వాళ్ల ప‌రిస్థితి కూడా అట్లా వుంటుంది. ఎన్నిక‌ల్లో గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొన్న త‌ర్వాతే అధికార మ‌త్తు వీడి, అయ్యో అప్పుడు అవి చేయ‌లేక‌పోయాం, ఇవి చేయ‌లేక‌పోయాం అని ప‌శ్చాత్తాపం చెందుతుంటారు. అందుకే చేతిలో అధికారం ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలి. పుణ్య‌కాలం మించిపోక ముందే, చంద్ర‌బాబు స‌ర్కార్ మేల్కొనాలి. చేతులు కాలాక‌ ఆకులు ప‌ట్టుకుంటే లాభం లేన్న‌ట్టే, ప్ర‌భుత్వ ఆయుష్షు తీరాక ల‌బోదిబోమంటే నిష్ఫ‌లం.

18 Replies to “స‌ర్కార్‌ ఆయుష్షు త‌గ్గుతోంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!”

  1. //ఎందుకంటే, గత ప్రభుత్వం తప్పులు చెయ్యడం వల్లే కదా కేవలం 11 సీట్లకి పరిమితం చేసింది// EVM tampering annaru, cbn fake promises annaru… annee abaddhalenaa

  2. పులికేశి గాడు కూడా manifesto ని భగవద్గీత బైబిల్ ఖురాన్ అని 99% హామీలు అమలు చేసాను అని చెప్పేడు కదా , చివరికి ఏమైంది ? జనాలు కు త్త కోసి కారం పెట్టి పంపించారు , జనాలకి కావాల్సింది సూపర్ సిక్సులు నవరంద్రాలు కాదు , కళ్ళు తెరువు

  3. Enti 6 nelalake … 5 years ruling Ani marchipoyaremo….. pension pempu..roads repair.. polavaram… amravati… bell company…constable posts….new houses…. ration lo ekkuva sarukulu…weavers ki free power…

  4. looks like this article is written by dash dash..check this lang…”ఇంకా అయిపోయిన పెళ్లికి మేళాలెందుక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది”..only one person writes this kind of lang.

  5. దారుణంగ పరిపాలిస్తున్నారు మొత్తం డబ్బు ను 28 గ్రామాలలో గుమ్మరిస్తున్నారు, 15000 cr. Grant కాదు అప్పు అన్నది వాస్తవం పైపెచ్చు ఈ govt buildings అన్ని revenue generate చేసేవి కావు, Will turn out to be liability for future generations

    1. నువ్వు పెట్టుకున పేరు బట్టే తెలుస్తుంది నీ పని అమరావతి మీద పడి ఏడవటం అని. భవిష్యత్ లో కూడా నీకు ఈ ఏడుపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

    2. తమకి మాత్రం తాడేపల్లి ప్యాలస్ గొడ్ల చావిడి లో కట్టు బానిస పని మాత్రం పక్క.

      రోజు ప్యాలస్ దొరలు పడేసిన చద్ది ఆన్న తినీ ఎంజాయ్ చెయ్యి.

  6. Ni bondha ra ..they started repairing all roads..I see in my Anantapur district almost all roads are completed now even for long distance villages are also getting roads now..this what people wanted not simply sitting in palace and push buttons..

  7. గత ఐదు సంవత్సరాల్లో రాయాల్సిన ఆర్టికల్ ఇది… కొంపదీసి అప్పుడు రాసి, పోస్ట్ చేసే ధైర్యం లేక ఇప్పుడు పోస్ట్ చేశారా.. ఒక్కసారి చెక్ చేసుకోండి రావు గారూ

Comments are closed.