మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్న

అయ్యన్న స్పీకర్ గా ఉంటూ చైర్మన్ గా మారడాన్ని ఆయన అంకితభావానికి నిదర్శనం అని టీడీపీ అంటూంటే వైసీపీ మాత్రం ఇది రాజకీయమని విమర్శిస్తోంది.

సీనియర్ నాయకుడు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మునిసిపల్ చైర్మన్ అయ్యారు. అంతటి స్పీకర్ అయ్యన్న మునిసిపల్ చైర్మన్ కావడమేంటి అని ఆశ్చర్యపోయేరు. అక్కడే ఉంది మ్యాటర్. అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం మునిసిపాలిటీలో ఎమ్మెల్యే హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. దాంతో ఆయన అక్కడ మెంబర్ అయ్యారు.

నర్శీపట్నం మునిసిపాలిటీ సర్వ సభ్య సమావేశానికి వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. వైసీపీకి చెందిన చైర్ పర్సన్ కూడా గైర్ హాజరు అయ్యారు. దాంతో అయ్యన్న చైర్మన్ పోడియం పైన ఉన్న సీటు లో ఆసీనులు అయి సభను నడిపించారు. తాను స్పీకర్ గా నర్శీపట్నం మునిసిపాలిటీకి 14 కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం కేటాయించానని వాటి ఆమోదం కోసం సభ తీర్మానం చేయాలని కోరారు. తనతో పాటు కౌన్సిల్ లో సభ్యులు కోరం సరిపోతుంది కాబట్టి తీర్మానం ఆమోదం అయిందని ప్రకటించారు.

చైర్ పర్సన్ హాజరు కాకపోయినా కోరం ఉంటే తీర్మానం నెగ్గి అమలు లోకి వస్తుందని అయ్యన్న చెప్పారు. అయితే ఒక వైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశంలో సంతాప దినాలు కొనసాగుతున్నాయని ఈ సమయలో కౌన్సిల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని వైసీపీ చైర్ పర్సన్ అంటున్నారు.

ఈ విషాద సమయంలో అయ్యన్న మునిసిపల్ సమావేశం తానే దగ్గరుండి నిర్వహించడం ఎంతవరకు సమంజసమో ప్రజలే నిర్ణయించాలని ఆమె కోరారు. నర్శీపట్నానికి గుండెకాయ మునిసిపాలిటీ. దాంతో వైసీపీ టీడీపీ అక్కడ నుంచే తమ రాజకీయానికి ఎపుడూ రంగం సిద్ధం చేసుకుటూ ఉంటాయి. అయ్యన్న స్పీకర్ గా ఉంటూ చైర్మన్ గా మారడాన్ని ఆయన అంకితభావానికి నిదర్శనం అని టీడీపీ అంటూంటే వైసీపీ మాత్రం ఇది రాజకీయమని విమర్శిస్తోంది.

4 Replies to “మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్న”

  1. వార్నీ!! వైసీపీకి అభివృద్ధికి చుక్కెదురు అని తెలుసు కానీ మరీ ఇంత దారుణమా? నిధులని ఆమోదించడానికి కూడా నాటకమా? పైగా దానికి మన్మోహన్ సింగ్ పేరు వాడతారా?

    1. అధికారం కోసం బాబాయ్ నే వేసేశాం….caసు ల నుండి బయటకి రావడం కోసం సొంత తండ్రి మీదనే తప్పు తోసేసాం ఇంకా మా వాడకం మీద మీకు అనుమానం ఉందా …అని అంటారేమో ???

  2. మన్మోహన్ సింగ్ చనిపోయారు కాబట్టి సంబరాలు దూరంగా ఉండాలి అంటే, అదో పద్దతి…అంటే కాని దైనందిన కార్యక్రమాలు చెయ్యకూడదు అని లాజిక్ ఏమిటో?

Comments are closed.