ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!

వాట్సప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ఆలోచన. కానీ.. అది భ్రష్టుపట్టిపోకుండా, ప్రజలు దానిని చీదరించుకోకుండా ఆ సేవలను వాడుకోవాలంటే.. ఖచ్చితంగా ప్రభుత్వం పంపే మెసేజీల విషయంలో సంయమనం ఉండాలి.

వాట్సప్ గవర్నెన్స్ అంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో ఏ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారో.. ఆ విధానాన్ని దాని స్వరూపరీత్యా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి 161 రకాల సేవలను వాట్సప్ ద్వారా ప్రజలకు అందించబోతున్నారు. బస్సు టికెట్ బుక్ చేసుకోవడం దగ్గరినుంచి ఆలయాల్లో దర్శనాలకు టికెట్లు బుక్ చేసుకోవడం, టూరిజం ప్రాంతాలకు టికెట్లు, అక్కడి గదులు తదితరాలు బుక్ చేసుకోవడం, ఆలయాలకు విరాళాలు ఇవ్వడం లాంటి అనేక పనులు వాట్సప్ ద్వారానే చేయొచ్చు. కుల సర్టిఫికెట్, ట్రేడ్ లైసెన్సు వంటివి కూడా పొందవచ్చు. కరెంటు బిల్లులు చెల్లించవచ్చు. ఇలా అనేక పనులు చేయవచ్చు.

మొత్తానికి స్మార్ట్ ఫోను వినియోగం గురించి కొంచెం అవగాహన.. స్పామ్ లింకులు వస్తే వాటి బారిన పడకుండా ఉండగల కొద్దిపాటి తెలివి ఉన్నవారికి ఈ వాట్సప్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. దీని ద్వారా రాష్ట్రప్రజల్లో లక్షల్లో, కోటికి మించి కూడా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.

కేవలం ప్రజలు ప్రభుత్వం నుంచి పౌరసేవలను పొందడం మాత్రమే కాదు. ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కావాలంటే కూడా వారినుంచి పొందవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఉంది. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా సమాచారాన్ని చేరవేయాలనుకున్నప్పుడు కూడా ఈ వాట్సప్ సర్వీసు ద్వారా వారికి మెసేజీలు పంపగలరు.

ఈ ఫీచర్ ను ప్రభుత్వం చాలా సంయమనంతో వాడాల్సి ఉంటుంది. తుపానులు, పిడుగులు పడడం వంటి విపత్తుల సందర్భాల్లో ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతవరకు మంచిదే.. కానీ.. లక్షల కోట్ల మందికి సింగిల్ క్లిక్ తో మెసేజీ పంపడానికి అవకాశం ఉన్నది కదా.. అనే ఉద్దేశంతో.. ప్రతిరోజూ ప్రభుత్వం గురించి, చేపట్టే పథకాల గురించి డప్పు కొట్టుకుంటూ ప్రమోషన్ మెసేజీలు పెడుతూ ఉంటే.. ప్రజలకు చిరాకు కలుగుతుంది.

ఇప్పటికే స్మార్ట్ ఫోనులు చాలా వరకు వ్యక్తి ప్రైవసీని మింగేశాయనే విమర్శలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మిత్రులనుంచి, ప్రతి ఒక్కరికీ లెక్కకు మిక్కిలిగా ఉండే గ్రూపుల నుంచి వచ్చే నానా చెత్త మెసేజీలను భరించలేక, అలాగని కాదనలని మొహమాటంతో ప్రజలు వాటిని మ్యూట్ చేసి కొంచెం ఊరట పొందుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ వద్ద ప్రజల నెంబర్లు ఉన్నాయి కదా అని.. ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా తమ ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేసుకునే మెసేజీలు పంపుతూ ఉంటే ప్రజలకు ఈ సర్వీసు మీదనే అసహ్యం పుడుతుంది.

వాట్సప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ఆలోచన. కానీ.. అది భ్రష్టుపట్టిపోకుండా, ప్రజలు దానిని చీదరించుకోకుండా ఆ సేవలను వాడుకోవాలంటే.. ఖచ్చితంగా ప్రభుత్వం పంపే మెసేజీల విషయంలో సంయమనం ఉండాలి.

5 Replies to “ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!”

  1. ప్రవచనాలు మీరే చెప్పాలి అది సరేగానీ, మొదట మావోడికి ఆ “ప్రతిపిచ్చ హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

  2. 🚨 1️⃣ జగన్ మోహన్ రెడ్డి గారు – రాజకీయ నాయకుడు కావాల్సిన మీరు, కోర్టు హాల్ స్టార్ అయ్యారు! 🤡🚨

    జగన్ గారు, 11/175 చూసినా ఇంకా మీ కళ్లకు తెరలేవా? ప్రజలు మీ ఓటు బ్యాంకు, కులాల మధ్య చిచ్చు పెడతారు అనుకున్న స్ట్రాటజీని భస్మం చేసేశారు! మీరు కమ్మ, కాపు సామాజికవర్గాలను టార్గెట్ చేస్తే మిగతా ఓట్లు వస్తాయని భావించారు, కానీ వాళ్లంతా మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు! 😆

    📢 ఇక మీ రాజకీయ డ్రామాలకు అంతం!

    👉 వాస్తవ అభివృద్ధి లేకుంటే, స్కీమ్‌లు వర్కౌట్ కావు!

    👉 ప్రజలకు కొత్త మోసాలు కాదు, కొత్త అవకాశాలు కావాలి!

    👉 ఓట్లు పొందడానికి మాటలు కాదు, రియల్ ప్రాజెక్టులు ఉండాలి!

    లేదంటే… 2024 ఒక ట్రైలర్, 2029లో బాక్సాఫీస్ ఫ్లాప్ ఖాయం! 🎬🚨

Comments are closed.