అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా అధికారం వైసీపీదే అని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో కూడా ఆ న‌మ్మ‌కాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌ళ్లీ అధికారంపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ఈ మేర‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో భ‌రోసా నింప‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినం సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ క‌న్నుమూసి తెరిచే లోపు ఏడాది గ‌డిచింద‌న్నారు. మ‌రో మూడు, నాలుగేళ్లు గ‌డిస్తే వైసీపీదే అధికారం అని ఆయ‌న అన్నారు.

త‌న పార్టీ ప్ర‌జ‌ల నుంచి పుట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే, చేస్తుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో వుంద‌న్నారు. వైసీపీ ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల గొంతుకగా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే వుంటుంద‌ని ఆయ‌న అన్నారు. కూట‌మి వ‌చ్చాక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్యం అయ్యాయ‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీకి ప్ర‌తిప‌క్షం కొత్తేమీ కాద‌న్నారు. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలోనే ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

విద్యార్థుల‌కు కావాల్సిన కేటాయింపులు చేయ‌కుండా వాళ్ల‌ను ఇబ్బంది పెడుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీ కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ భ‌విష్య‌త్‌పై నాయ‌కుల్లో ఆందోళ‌న నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. అయితే చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌… ఊహించ‌ని రీతిలో వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది. ఇదే జ‌గ‌న్‌లో, అలాగే వైసీపీ నేత‌ల్లో భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైంది.

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా అధికారం వైసీపీదే అని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో కూడా ఆ న‌మ్మ‌కాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ శ్రేణుల్లో నిరాశ స్థానంలో ఉత్సాహం క‌నిపిస్తోంది.

19 Replies to “అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా”

  1. ఏంటి తరువాయి ఎలేచ్షన్స్ బాలట్ పేపర్ తో పెడతాం అని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా ..

  2. kallu moosukuni padukuni nidhra lesthe 5 samvathsaraalu poorthi avuthundhi. mallee manadhe adhikaaram …..pichhi sannasi mundhu ee aalochana maanuko …mallee YCP gelichedhi ledhu.

  3. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదేనా??

    Graguate MLC ఎన్నికలు మొన్న వచ్చినాయ్ కదా?? ‘ఉచ్చోసుకుని మనం కనీసం పోటీ చెయ్యలేదు కదా?? పోనీ మనం support చేసిన కాండిడేట్ గెల్చాడా?? లేదే మరి ఈ 11 ప్రగర్భాలు ఎందుకు రా లెవెనూ??

  4. Why not 175? కన్నా ఏమైనా భరోసా ఉందా?అప్పుడు ఏమయిందో తెలుసుగా…..సర్లే కాని ముఖ్యమంత్రిగా అంటే బ్యారికేదెలు ఓకే , ఈ రోజు కూడా ఎందుకు పెట్టినట్లో

  5. MLC elections lo poti cheyataniki dikkuledu… elections eppudu vachina tiruguledu anta???

    Party function cheyataniki manushulu leru..

    Leaders antha jail lo…

    Annaya palace lo….

    Sarvam govinda

Comments are closed.