కోట‌రీ వ‌ల్లే జ‌గ‌న్‌కు దూరం అయ్యా

జగన్ చుట్టూ ఉండే కోటరీ తనకు, జగన్‌కు మధ్య అగాధం ఏర్పరిచిందని, మూడు ఏళ్లుగా తనను తొక్కుతూనే కొంత మంది పైకి ఎదిగారని చెప్పారు.

వైసీపీలో ఆ పార్టీ అధినేత తర్వాత స్థానంలో ఉంటూ వచ్చి, చివరకు రాజకీయ సన్యాసం చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్, ఆయన కోటరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తాను పడ్డ అవమానాలు ఎవరూ పడలేదని, జగన్ చుట్టూ ఉండే కోటరీ వల్లే పార్టీకి దూరం అయినట్లు బాంబ్ పేల్చారు.

ఎంపీ పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా జగన్‌పై ఒక మాట మాట్లాడని విజయసాయిరెడ్డి, ఇవాళ కాకినాడ పోర్టు కేసులో సీఐడీ ఎదుట విచారణకు హాజరై అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ చుట్టూ ఉండే కోటరీ తనకు, జగన్‌కు మధ్య అగాధం ఏర్పరిచిందని, మూడు ఏళ్లుగా తనను తొక్కుతూనే కొంత మంది పైకి ఎదిగారని చెప్పారు. అయితే, దాని వల్ల తాను పెద్దగా నష్టపోలేదన్నారు. కోటరీకి దగ్గరగా ఉంటేనే జగన్‌ను కలవనిస్తారని ఆరోపించారు.

పార్టీ అధినాయకుడు, చెప్పుడు మాటలు వినకూడదని, వింటే పార్టీకే నష్టం జరుగుతుందని అన్నారు. వైసీపీలో తాను పడిన అవమానాలు ఎవరూ పడలేదని, తాను మారలేదని.. తన నాయకుడే మారిపోయాడని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలు వదిలేశానని, అయినప్పటికీ ఇప్పటికీ జగన్‌కు మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. మొత్తానికి, జగన్ చుట్టూ ఉండే కోటరీ వల్ల జరుగుతున్న నష్టాన్ని విజయసాయిరెడ్డి స్పష్టంగా తెలియజేశారు.

కాకినాడ పోర్టుపై కూడా స్పందిస్తూ, ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కేసు అని, కేవీ రావుతో తనకు ముఖ పరిచయం తప్ప ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. కాకినాడ డీల్ మొత్తం సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిదేనని వెల్లడించారు.

రెండు రోజుల క్రితం కూడా వైసీపీ పోరుబాట పోస్టర్లలో వైఎస్‌ఆర్ ఫోటో లేకుండా, జగన్ ఫోటోను కిందికి నెట్టి, సజ్జల ఫోటోను మాత్రం హైలైట్ చేసిన విషయం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్లే పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయినప్పటికీ, జగన్ సజ్జలను దూరం పెట్టకుండా, గతంతో పోలిస్తే మరింత ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.

25 Replies to “కోట‌రీ వ‌ల్లే జ‌గ‌న్‌కు దూరం అయ్యా”

  1. అంటే జగన్ కి ఏమి తెలియదు అంటావ్? అంటా కోటరీనే అంటావ్.జగన్ తెలియకుండానే సజ్జల టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల్ని మంత్రుల తో కలిసి మంతనాలు చేసాడు అంటావ్.జగన్ కి తెలియకుండానే కరోనా టైం లో వైద్య శాఖ మంత్రిని పక్కన పెట్టి సజ్జల ఉపాదాట్లు ఇచ్చాడు అంటావ్, జగన్ కి తెలియకుండానే ఒక సలహాదారు ప్రభుత్వం లో కీలక అంశాలు మాట్లాడాడు అంటావ్. ఇంత జరుగుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నట్లు? PubG ఆడుకుంటున్నాడా?

  2. Sajjala ante Jagan ki bhayamemo…

    Nenaithe poster lo sajjala pic చూసి ఆశ్చర్య పోయా.

    Sajjala ఫోటో పెడితే అన్ని ఫ్లాప్ అవుతాయి

    Jagan ki oka సూచన – నా కంటే chinnode వయసులో.

    సజ్జనులను thappinchalekapothe(sajjala గురించి complaint ఉన్నాయని నీకు తెలుసు అనుకుంటున్నా. ఎందుకు thappinchalekapothunnavo అది నీకే theliyali) party ని Sajjala చేతి lo పెట్టి నువ్వు Retirement తీసుకో. గౌరవం అన్న miguluthundi.

    Sajjala చేతిలో party భ్రష్టు పట్టడం lanchaname

  3. సజ్జల రామాకృష్ణ రెడ్డి జగన్ తో వెంట ఉన్నంత కలం జగన్ విజయానికి బెజ్జాలె.

    పాలసీలో పడుకొని రామా కృష్ణా అనుకోవలసిందే.

  4. అసమర్ధుడు కోటరీలతో బ్రతుకు వెల్లదీస్తాడు దుర్యోధనుడు శకుని సలహాల మీద ఆధార పడి బ్రతికినట్లు….కుతంత్రాల కోసం కోటరీ, సబ్జెక్టు కోసం వందల మంది సలహాదారులు, వాళ్ళు చాలనట్లు అడుగు అడుగునా ఏమి చెయ్యాలో చెప్పడానికి ఐ-ప్యాక్ …. ఎవ్వరో ఒక్కరు రాసి ఇస్తే కానీ ఒక్క మాట మాట్లాడలేడు … అది కూడా నత్తి …. సంక్షేమానికి వీరుడు అని చెప్పుకుంటారు ఆ పదం పలకడం కూడా తిన్నగా రాదు…. తల్లి వదిలేసింది…. చెల్లి ఛీ కొట్టింది…. రైట్ హ్యాండ్ లాంటి విజయసాయి గారు మొహాన ఉమ్మేసారు… పార్టీ ఆవిర్భావం రోజు జరుపుకోలేని పార్టీ ఏమి పార్టీ రా…. నీవు ఎక్కడ నించి మొదలు అయ్యావో అదే నీకు బద్దం బద్ధం

      1. ఆ నలభై శాతం టిడిపి కి కూడా ఉన్నారు..

        అధికారం రావాలంటే 45 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి.. ఆ నలభై శాతం ఓట్లు ఏటు పడవు కాబట్టి ధైర్యంగా నాలుగు పీకవచ్చు..

  5. A2 నాకేం తెలీదు విక్రాంత్ రెడ్డె చెసాడు అంటున్నాడు! అయినా బెదిరించి GV Rao పెరున ఉన్న పొర్ట్, SEZ నీ అల్లుడి కంపనీకి రాయించాల్సిన అవసరం వాడికెందుకు?

    .

    బెదిరించి ఆస్తులు లాకొవటం అంటె… ఎదొ సినిమాలలొ చూసం కాని ఇలా వెల కొట్ల అస్స్తులు బెదిరించి లాకొవటం గురించి వినటం, చూడటం ఇదె మొదటిసారి! 30 ఎళ్ళు మనదె అదికారం అనుకొని ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చెసారు!

  6. కేవీరావు కామన్ ఫ్రెండ్ విక్రాంత డీల్ చేశాడు అని చెప్పాడంట ఎందుకూ వియ్యంకుడు అడిగితే చెపుతాడు గా? వియ్యంకుడు తప్పు చేయలేదు డీల్ కుదిరించిన విక్రంత ది తప్పు ఏంటి సాయి ఇది

  7. అన్నయ్య పేరుకు మాత్రమే సింహం (సింగిల్)..

    వదినమ్మ, సజ్జల చేతిలో పార్టీ పెత్తనం నడుస్తుంది..

  8. Hammayya…mana GA ki inko thodu dorikadu… kotari meeda padi edavadaniki…. arey…… babu…nammandi…

    Kotari dati vellalekapovatam kaadu…

    Annaye kotari srustinchadu…

    Chesedanta annayane….

    Janalaki ala colouring istadu ..

    Plz dont think like sheeps..

    Come out of it

  9. Why there are no comments from Anna’s party supporters condemning VSR’s comments on kotari, vikranth reddy, liquor scam? Seems they agree with what he said.

  10. సరే. మరి విక్రంథ్ రెడ్డి. గురించి. కసిరెడ్డి గురించి కూడా చాలా చెప్పాడు అవి కవర్ చేయ లేదేం

  11. ఆఖరికి కరుడుకట్టిన కార్యకర్తైన ఈయన నోటి నుండి కూడా ఇవే మాటలు వచ్చాయంటే నమ్మక తప్పడం లేదు ! పార్టీ కి ప్రజలు ముఖ్యమో లేక నీ కోటరీ ముఖ్యమో ? అయినా ..పిచ్ కాకపోతే ..ఆయప్ప బయట పడేది లేదు, బాగుపడేది లేదు.

Comments are closed.