వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ మద్దతు వుంటుందా? వుండదా? అనే చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీకి సంబంధించి సీ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలు రాయించుకున్నారని బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి ఏ1, విజయసాయిరెడ్డి ఏ2, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు.
ఇప్పటికే విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. రెండురోజుల క్రితం విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు ఇవ్వడంతో కేసు మరోసారి చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి బుద్ధిగా బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. విజయసాయిరెడ్డి వెంట న్యాయవాదుల్ని అనుమతించలేదు. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళ్లి వచ్చారు.
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి… రాజకీయాల నుంచి కూడా నిష్క్రమించానని ప్రకటించారు. అందుకే విజయసాయిరెడ్డికి ఏ మేరకు వైసీపీ నుంచి మద్దతు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయసాయికి విలువలు లేవన్నట్టు ఆ మధ్య వైఎస్ జగన్ పరోక్షంగా అన్నారు. జగన్ అలా అనడంపై విజయసాయిరెడ్డి మనస్తాపం చెంది, కౌంటర్‌గా ట్వీట్ చేశారు.
వైసీపీతో పాటు రాజకీయాలకు స్వస్తి చెప్పిన సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుటుంబానికి జగన్‌తో పాటు వైసీపీ నాయకులంతా అండగా నిలిచారు. పోసాని భార్యకు జగన్ ఫోన్ చేసి ధైర్యంగా వుండాలన్నారు. తామంతా అండగా వుంటామని భరోసా ఇచ్చారు. అలాగే కేసు వ్యవహారాల్ని తామే చూస్తామని జగన్ అన్నారు. ఒకవేళ విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం ఏదైనా కఠిన చర్యలకు దిగితే, జగన్, ఆయన పార్టీ అండగా వుంటుందా? అనేదిప్పుడు చర్చనీయాంశమైంది.
వంశీ లా కేవలం అందంగా ఉన్న యువ మొగాళ్ళ కే మా సాక్యాత్తు A1మహిళా మద్దతు ఉంటుంది..
ఈ ముసలోడికి మద్దతు ఎలా ఎలా ‘రే గ్యాస్ హౌలే?? అందుకే నైస్ గా వదిలించుకు0ది.
అందుకే పోసాని కి మద్దతుగా జై’ల్ కి రాలేదు.. I
విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారుతాడు. అప్పుడు అన్నియ్యకి దబిడి దిబిడే.
A2 నాకేం తెలీదు విక్రాంత్ రెడ్డె చెసాడు అంటున్నాడు! అయినా బెదిరించి GV Rao పెరున ఉన్న పొర్ట్, SEZ నీ అల్లుడి కంపనీకి రాయించాల్సిన అవసరం వాడికెందుకు?
.
బెదిరించి ఆస్తులు లాకొవటం అంటె… ఎదొ సినిమాలలొ చూసం కాని ఇలా వెల కొట్ల అస్స్తులు బెదిరించి లాకొవటం గురించి వినటం, చూడటం ఇదె మొదటిసారి! 30 ఎళ్ళు మనదె అదికారం అనుకొని ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చెసారు!
ఇదేదో అల వైకుంఠపురంలో సినిమా కత లా ఉందిగా? అప్పలనాయడూ!
అవినాష్ రెడ్డి కి jagan మద్దతు ఎవ్వలెదా? అలానె ఈయన నొరు తెరవంత వరకూ ఈయన కూడా మంచివాడె! అయినా తేడా వస్తె ఒక్కసారి గా చెలెల్లి మీదె నీచం గా రాసిన వాళ్ళకి వీడు ఒక లెక్కా?
.
అదికారం ఉన్ననొల్లూ వెళ్ళకి అదికార మదం తొ మాకు ఎదురె లెదు అని పెట్రగిపొయారు! ఇప్పుడు ఒక్కొక్క అరాచకం భయటకి వస్తుంటె, డ్రామాలు వెస్తున్నారు!
అన్నయ్య మద్దతు లేకపోతేనే బెటర్..
లేకపోతే బోరుగడ్డ పరిస్థితి అవుతుంది..
Vundakapovochu
Ippatike chala leak lu ichhadu… inkemaina ichhado… bathroom lo shavam avutadu…
As usual ga heart attach ani pracharam chestharu..
వీసా రెడ్డి నిజాలు చెప్తే చాలు.. ఆయనకి కావాల్సిన సపోర్ట్, ప్రొటెక్షన్ కూటమి ప్రభుత్వం చూసుకొంటది. మీ భయం కూడా అదేగా .. అన్న మళ్ళీ జైలుకి పోతే మీకు బిచ్చం వేసే వాళ్ళు ఉండరు.. పాపం