స్వామి దెబ్బ‌… ముచ్చెమ‌ట‌లు?

బీజేపీ సీనియ‌ర్ నేత, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కేసు స్వీక‌రించారంటే, అటు వైపు వాళ్లు ఏ స్థాయి అయినా మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.

బీజేపీ సీనియ‌ర్ నేత, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కేసు స్వీక‌రించారంటే, అటు వైపు వాళ్లు ఏ స్థాయి అయినా మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే. జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ లాంటి వాళ్లంతా స్వామి బాధితులే. అలాగే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి వేసిన కేసులోనే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఇప్ప‌టికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా జ‌రిగిన హింస‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఏపీ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయ‌న పిటిష‌న్‌పై ఇవాళ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఎన్నిక‌పై స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వంతో పాటు ఎన్నిక‌ల సంఘానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే సంద‌ర్భంలో పోలీస్‌శాఖ‌కు కూడా నోటీసులు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో పాల్గొనేందుకు తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ ఎం.గురుమూర్తి, మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, అలాగే వైసీపీ కార్పొరేట‌ర్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేసిన‌ట్టు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఉన్న‌ప్ప‌టికీ, ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన‌ట్టు కేసు న‌మోదు చేయ‌డంపై స్వామి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అందుకే డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌పై ఇచ్చే తీర్పు దేశానికే ఒక చ‌ట్టం కావాల‌ని కోరుతూ స్వామి పిటిష‌న్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స్వామి పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం, పోలీస్ అధికారులు, అలాగే ఎన్నిక‌ల అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు త‌ప్ప‌వు. అందుకే ఈ కేసుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది.

18 Replies to “స్వామి దెబ్బ‌… ముచ్చెమ‌ట‌లు?”

  1. జగన్ కూడా తిరుగుతున్నాడు గా మరి కోర్ట్ చుట్టూ? ఎవరి దెబ్బ?

    1. ఊరుకోండి కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతున్నాడు..

      యలహంక టు తాడేపల్లి తిరుగుతూ ఉంటే

  2. High court has condemned your govt numerous times on many issues. Even your CS and DGP had to attend the court personally to apologise. Appudu mee maata vinna adhikaarulaki muchemataku pattaledaa?

    1. ప్రతి రోజు.. MLC వరుదు కళ్యాణి…. పప్పు గాడికి ముచ్చెమటలు పట్టిస్తూ ఉందే .. మొన్నటికి మొన్న.. పప్పు గాడు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాం అంటే.. ఎక్కడ ఎప్పుడిచ్చారు అని నిలదీస్తే.. తప్పు ఒప్పుకుని స్పెల్లింగ్ Mistake అని సర్ది చెప్పుకున్నారు..అది మర్చి పోతే ఎలా ర?

        1. ఇక్కడ.. బెండపూడి లో ఎవడు చదివారు ర..? నువ్వు చదివుంటే.. మరి.. తెలుగు ను ఇంగ్లీష్ లో ఎలా రాస్తున్నావ్ ర? ఊళ్ళో తెలుగు మీడియం చదివినోడికన్నా ఘోరంగా ఉన్నవ్ కదా ర!

          1. మరి.. అయితే.. వాడు.. బెండపూడిలో చదివి ఉంటె.. ఇలా దరిద్రంగా రాసేవాడు కాదు.. బాగా రాసేవాడు అంటావ్ మరి.

    2. జీవీ రెడ్డి అవినీతి చేస్తున్నారు అధికారులు అంటే.. నాకు తెలుసు ఇంటలిజెన్స్ నివేదిక ఉంది అక్కడ అవినీతి జరుగుతోంది అని చెప్పి ఆయనను తప్పించి అదే అవినీతి అధికారులకు విచారణ చెయ్యమని ఇవ్వటం వాళ్ళు అన్ని కప్పి పుచ్చి అస్సలు అవినీతే జరగలేదు అని నివేదికివ్వటం D0 ng@ చేతికి తాళాలు ఇవ్వటం నీతి మాలిన పని కదా ర Yerr! Puvv@

      మళ్ళి గవర్నమెంట్ మారితే.. ఈ అధికారులందరూ.. న్యాయస్థానాల చుట్టూ తిరిగి క్షమించమని వేడుకుని కుదరకపోతే.. లోపల కూర్చోవలసిందే గా బొల్లి గాడిలాగా??

      1. Malli govt maarutundanvaataa!!! Mee party veeraabhimaani ayina ee website vaadike doubt gaa vundi. Kaavaalante articles chaduvuko. Neelaage veedu kudaa confused mind to vunnaadu. Nenu already cheppinattu pagati kalalu kantoo vundu.

Comments are closed.