ఇలాగైతే వైసీపీ బ‌ల‌ప‌డేదెట్టా?

కూట‌మి ఎత్తుగ‌డ‌ల్ని చిత్తు చేసే ఉపాయాన్ని క‌నిపెట్టాలి. అప్పుడే వైసీపీకి తిరిగి పూర్వ వైభ‌వం వ‌స్తుంది.

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ నాయ‌కుల‌కు చెప్పిందే చెబుతున్నారు. కొత్త విష‌యాలు ఏవైనా చెప్పి, చైత‌న్య‌ప‌రుస్తార‌ని అనుకుంటే, అబ్బే ఆ ప‌నే చేయ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ అప్‌డేట్ అవుతున్నారా? లేదా? అనే అనుమానం క‌లుగుతోంది. ఎంత‌సేపూ తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది త‌ప్ప‌, ఏ ఇత‌ర సంగ‌తులు మాట్లాడక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇవాళ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు బుధ‌వారం తాడేప‌ల్లిలో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడించే అల‌వాటు జ‌గ‌న్‌కు లేనేలేదు. రికార్డు చేసిన‌ట్టుగా, కంఠ‌స్థం చేసిన మాట‌ల్నే ప్ర‌తి స‌మావేశంలో ఆయ‌న వినిపిస్తున్నారు. ఇవాళ కూడా అదే ప‌ని చేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అబ‌ద్ధాలు, మోసాల‌పై ప్ర‌జ‌లు కోపంతో ఉన్నార‌న్నారు. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి ప్ర‌తినెలా ఒక్కో అంశాన్ని కూట‌మి స‌ర్కార్ తెర‌పైకి తెస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబు సంప‌ద సృష్టి అంటే బాదుడే బాదుడు అని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల‌కే ఎప్పుడూ చూడ‌ని వ్య‌తిరేక‌త ఈ ప్ర‌భుత్వంపై వుంద‌న్నారు. ఇలా కూట‌మి స‌ర్కార్‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

ప్ర‌తినెలా కూట‌మి డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు చేస్తుంటే, విరుగుడుగా తామేం చేయాలో జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌డం లేదు. అస‌లే కూట‌మి అధికారంలో ఉంది. పైగా మీడియా బ‌లం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌నే చాలా సంద‌ర్భాల్లో టీడీపీ మీడియా ఎంత శ‌క్తిమంత‌మైందో వివ‌రిస్తుంటారు. తాడేప‌ల్లికి పార్టీ నాయ‌కుల్ని పిలిపించుకుని కేవ‌లం ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటే, బ‌ల‌ప‌డుతామా? అనేది జ‌గ‌న్ ఆలోచించాలి.

కూట‌మి ఎత్తుగ‌డ‌ల్ని చిత్తు చేసే ఉపాయాన్ని క‌నిపెట్టాలి. అప్పుడే వైసీపీకి తిరిగి పూర్వ వైభ‌వం వ‌స్తుంది. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కొన‌సాగితే, ఎంత‌కాలమైనా వైసీపీ బ‌ల‌ప‌డే అవ‌కాశం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

45 Replies to “ఇలాగైతే వైసీపీ బ‌ల‌ప‌డేదెట్టా?”

  1. గే ట్ ఆం ధ్ర సీనియర్ జర్నలిస్ట్ మూర్తి అలియాస్ దేవిప్రియ ఆరు నెలలపాటు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్ .. తన సొంత ప్రాబల్యం కోసం సభ సభ్యుల మనోభావాల్ని దెబ్బ తీస్తున్నారని కారణాలతో సస్పెన్షన్

  2. No need to work hard. People will realise and will know true colors of EVM batch. Just relax for next b3 years and spend time with party cadre is enough. No need to fight for people, let me get pain from EVM

  3. Not sure why Jagan cries on TDP media strength, Jagan has the support of TV9, NTV, both have atleast 10 million subsribers whereas ETV, TV5 and ABN has less than half. He has his very own Sakshi to defend whatever he does.

    1. TV9, NTV are not like ETV, TV5 & ABN. Every article & every day mud slinging on Jagan. You see TV9 & NTV is not doing that. Agree they might have edge at Jagan but not cooking stories on CBN/TDP.

  4. వారు తాడేపల్లి నివాసాన్ని వదిలి ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ ఊరుకు ఆ ఊరు వెళ్లి కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడాలి.

    అది కూడా రాసిచ్చిన స్క్రిప్టు లేకుండా.
  5. భలపడాల్సిన పనేముంది??

    Just ఓ అలా కళ్ళు మూసుకుంటే చాలు..5 ఏళ్ళు అలా గిర్రున తిరిగి, మన అతి మంచితనంతో & మన అతి నిజాయితీ తో అధికారం అదే తన్నుకుంటూ వస్తది కదా??

    మన పార్టీ వాళ్లకి మూసుకోవడానికి just కళ్ళు ఉంటే చాలు.. భలం అవసరమే లేదు ఏమంటావ్ తి0గిరి 11?

  6. మా పార్టీ క్యాడర్ ని ఈ మాదిరిగా motivate చేస్తూ నడిపిస్తున్న సింగిల్ సింహాన్ని శాలువా కప్పి, సన్మానించి అవార్డు ఏమైనా ఉంటే ఇవ్వాలసింది పోయి, ఈవిధంగా అవమానిస్తావా?? నీ ఫాల్స్ ప్రాపగాండా వల్లే ఇవాళ మావోడికి ఈ పరిస్థితి తెచ్చింది రా గ్రేట్గ్యాసు..!

  7. There was only one Sakuni in Mahabhaarath.

    Here telugudesam has so many Sakuni s .

    Moreover Karna also joined hands with Drutharastra and Dhuryodhana in 2024 elections.

    victory may take more time but winning is sure .

  8. కోటరీ అన్నియ్యను అప్డేట్ అవ్వనీయటం లేదు రాస్తే సరిపోయేది కదా!

  9. కామిడీ కాకపోతే వీడికి వ్యూహాలా ? వీడికంటే ఐదో తరగతి స్టూడెంట్ కి IQ ఎక్కువ . ఏదో గాలి వాటం, మోడీ సహాయం తో ఒకసారి సీఎం అయ్యాడు. లేకపోతే వీడు సీఎం ఏంటి

  10. తేడా కనిపించడం మొదలు అయింది అని ప్రజలు చెబుతున్నారు. తేడా ఏమిటి అనేది తెలుసుకోండి.

Comments are closed.