పేర్ని నాని భార్య‌పై కేసు న‌మోదు

పేర్నిని కాద‌ని ఆయ‌న భార్య జ‌య‌సుధ‌పై పోలీసు కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం ఆ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు సైలెంట్ అయ్యారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. ఈ నేప‌థ్యంలో కూట‌మి స‌ర్కార్‌పై ఘాటుగా విమ‌ర్శిస్తున్న ప‌రిమిత నాయ‌కుల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఒక‌రు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన సెటైర్స్‌తో పేర్ని విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌చిలీప‌ట్నం నుంచి త‌న కుమారుడు కిట్టు అలియాస్ కృష్ణ‌మూర్తిని వైసీపీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో నిలిపారు. పేర్ని కుమారుడు ఓడిపోయారు. కుమారుడు గెలిస్తే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని అనుకున్న‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో పేర్ని తెలిపారు. అయితే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయ అవ‌సరాల దృష్ట్యా పేర్ని మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు.

అయితే పేర్నిని కాద‌ని ఆయ‌న భార్య జ‌య‌సుధ‌పై పోలీసు కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రెండు రోజులుగా పేర్ని నాని అక్ర‌మంగా పేద‌ల బియ్యం త‌ర‌లించారంటూ క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు పేర్ని కుటుంబాన్ని కూట‌మి ప్ర‌భుత్వం కేసులో ఇరికించింది.

మ‌చిలీప‌ట్నంలో పేర్ని నాని భార్య పేరుతో గిడ్డంగి వుంది. దీన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖకు వైసీపీ హ‌యాంలో అద్దెకు ఇచ్చారు. ఇటీవ‌ల పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ అధికారుల త‌నిఖీలో ఆ గిడ్డంగిలో బియ్యం నిల్వ‌ల్లో తేడాను గుర్తించార‌ట‌. 185 ట‌న్నుల బియ్యం మాయ‌మైన‌ట్టు గుర్తించామ‌ని, ఇందుకు బాధ్యురాలిని చేస్తూ పేర్ని జ‌య‌సుధ‌పై పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారి కోటిరెడ్డి మ‌చిలీప‌ట్నం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆమెపై కేసు న‌మోదు చేశారు.

14 Replies to “పేర్ని నాని భార్య‌పై కేసు న‌మోదు”

  1. రెండు రోజులనుంచి అక్రమంగా బియ్యం తరలిస్తున్న వార్త ఇక్కడ ఎందుకు రాలేదు?

  2. Fafam ..entha Fanindhi…mari ippudu oka press meet pettalekapoyadaa..muddi kindaa ..machaa pettukoni..baytiki vachi eeni neethu cheptadu ra eedu…#pawankalyan tho pettukuntey..evadikina antey..

  3. అబ్బో జయసుధ మెడలో నగలు చూస్తీ 185 క్వింటాళ్ళు కాదు, నెలకి 1000 క్వింటాళ్ళు కొట్టేసినట్టు అర్థమవుతావుంది ఏమంటావ్ గ్రేట్ గ్యాసు??

    తొర్రోడికి అందమైన జయసుధ సూటబుల్ కాదు…. ఏదో తేడా గా ఉంది

  4. She never involved in politics and she never ever seen in public functions related to politics…

    there may be something else to control her husband from talking to media……

    ilativi chesthe edo oka roju avi backfire avuthaayi…

    if you have guts investigate, if proven cease the factory and other things within judicial powers .

    publicity enduku

Comments are closed.