వైసీపీ వింత వాద‌న‌

ప్ర‌తిప‌క్ష హోదా సాధించ‌డం కోస‌మైతే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. సోమ‌వారం నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇంత‌కాలం అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా భీష్మించిన వైసీపీ, ఇప్పుడు నిర్ణ‌యం మార్చుకుంది. అయితే తాజాగా స‌మావేశాల‌కు వెళ్లేందుకు చెప్తున్న కార‌ణం వింత‌గా వుంది. ప్ర‌తిప‌క్ష హోదా అడ‌గ‌డానికే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్తున్న‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు చెప్తున్నారు.

ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌ని, తామేం చేయాల‌ని స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌, ముఖ్య‌మంత్రి ప‌దేప‌దే చెప్తున్నారు. ప‌ది శాతం సీట్లు ఉంటేనే, ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తార‌నేది కూట‌మి వాద‌న‌. ఇలా అని రాజ్యాంగంలో ఎక్క‌డుంద‌ని వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. రాజ్యాంగంలో లేక‌పోయినా, సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌ని టీడీపీ నేత‌లు స‌మాధానం ఇస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో హైకోర్టును కూడా వైఎస్ జ‌గ‌న్ ఆశ్ర‌యించారు. స్పీక‌ర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అయిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ స్పందించ‌లేదు. వైసీపీ తాజాగా ఎలాంటి వ్యూహంతో అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని అనుకుంటుందో తెలియ‌దు. కానీ అధికారికంగా వాళ్లు చెప్పేది ఆశ్చ‌ర్యం అనిపిస్తోంది.

ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోతే, ఒక ఎమ్మెల్యేగా త‌క్కువ స‌మ‌యం ఇస్తార‌ని, దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ అంటున్నారు. ఇది నిజ‌మే. కానీ చేయ‌గ‌లిగేదేమీ లేదు. ప్ర‌తిప‌క్ష హోదా సాధించ‌డం కోస‌మైతే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అది వృథా ప్ర‌యాసే. అసెంబ్లీకి వైసీపీ వెళితే ఏమ‌వుతుందో చూడాలి.

19 Replies to “వైసీపీ వింత వాద‌న‌”

  1. 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి అరుపులు :

    టీడీపీ నుండి నలుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఊడిపోతుంది..

    ..

    2019 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ రెడ్డి గాండ్రిమ్పులు..

    కూటమి నుండి 164 మందిని లాగేస్తే అధికారం ఊడిపోతుంది..

    ..

    రేపటి నుండి కావాల్సినంత కామెడీ..

    ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే.. చంద్రబాబు ఆధారాలతో జగన్ రెడ్డి బండారం బయట పెడతాడు..

    అందుకే..

    ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతాం.. అదే జగన్ రెడ్డి “వ్యూహం”..

    సోషల్ మీడియా లో ఆహా.. ఓహో అంటూ భజన చేయడం .. నీలి కుక్కల పని..

  2. సరే ఇంతకీ ఆ వాదన ఏంటో చెప్పలేదు…అసలు టైటిల్ కి లోపల కంటెంట్ కి ఏమన్నా సంబంధం ఏడ్చిందా ???

  3. నిజంగా నువ్వు ఇప్పుడు రాయాలి…

    YCP ని అస్సెంబ్లీ కి తీసుకొస్తున్న గనత TDP దె! (అనర్హత వెటు అని చెప్పి)

  4. కేవలం రఘురామ కు భయపడే జెగ్గులూ గాడు అసెంబ్లీకి వస్తున్నాడు…

    ఇంతకన్నా వేరే కారణం ఎంత మాత్రం కాదు…

    ఇలాంటి వాడు ఇంత పిరికి వెధవ ప్రతిపక్ష హోద కోసం వెంపర్లాడటం చేస్తున్నాడు…

    థూ… వీడోక లీడర్…

    వైసీ పీ కార్యకర్తలు ఒక సారి ఆలోచించండి…

    ఇలాంటి వాడా మాకు నాయకుడు అని

    1. Bayama jagan ka Babu gadini adugu chepthadu pk gadini adugura chepthadu okkadini vodinchataniki mugguru kalisi poti chesi na sannalu bayam kosam matadakudadhu ra pulka

  5. RRR మగాడ్రా బుజ్జీ,

    స్కూలు కి రాను అని మారం చేసే పిల్లాడి చెవి మెలేసి స్కూల్ కి తీసుకువచ్చినట్లు, ప్రజల డబ్బుతో ఎంఎల్ఏ గా అయ్యి, అసెంబ్లీ కి రాను అని విమానాల్లో ప్రతివారం బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతున్న ఆ ఎంఎల్ఏ గాడిని తొడ పాశం పెట్టీ మరీ తీసుకు వస్తున్నాడు.

    1. Who fooled public with false propaganda and fake promises and came to power. Who cheated public. Just asking.Public voted trusting fake promises super six and false propaganda by them and supporting media.

Comments are closed.