
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రేపు ఉ. 10. 30కు వాదనలు వింటామని తేల్చి చెప్పింది.
కాగా ఈనెల 16, 19న రెండుసార్లు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగా..పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఈనెల 27 వరకు విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. ఆ తరువాత ముందస్తు బెయిల్ కు సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా ఊరట దక్కలేదు. హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది.
తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దే అవినాశ్ ఉన్నారు. దీంతో కొందరు సీబీఐ అధికారులు ఇప్పటికే కర్నూలులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా కోర్టు తీర్పు బట్టి సీబీఐ ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని చూడాలి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా