Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!

ఉత్తరాంధ్ర మీద బాబు నంగనాచి కబుర్లు!

ఉత్తరాంధ్ర మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. 2014 నాటికి ఏపీ విభజన జరిగి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో కల్పవల్లిలా విశాఖపట్నం కళ్ళ ముందే ఉంది. రెడీ మేడ్ క్యాపిటల్ సిటీ ఇది శివరామకృష్ణ కమిటీ శ్రీ కృష్ణ కమిటీ కూడా విశాఖను రాజధాని చేసుకోమని సలహాలు సూచనలు చేశాయి.

కానీ ససేమిరా అంటూ చంద్రబాబు ముందుకెళ్లారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీ ఆర్ధిక స్తోమత పరిస్థితులు చూసుకోకుండా అమరావతి రాజధాని అంటూ నవ నగరాల నిర్మాణం అంటూ ఏవేవో చెబుతూ జనాలను అయిదేళ్ళు మభ్యపెట్టారు. విశాఖ ఎందుకు రాజధానికి అర్హత కాకుండా పోయింది బాబూ అంటే ఈ రోజుకీ ఆయన దగ్గర జవాబు లేదు పైగా విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని అంటారు. అది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మపదార్థం లాంటి మాట.

దీని మీదనే వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ బాబు మీద ఫైర్ అయ్యారు. విశాఖ విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేస్తామని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని జగన్‌మోహన్‌ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. చంద్రబాబేమో విశాఖలో రాజధాని ఉండటానికే వీల్లేదంటూ కోర్టులకు వెళ్ళి మరీ అడ్డుపడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

విశాఖ దేశంలోని మెగా సిటీల స్థాయి నగరంగా పెరగకూడదని కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ వస్తున్న బాబుకు ఉత్తరాంధ్రా మీద ప్రేమ ఎక్కడిని అని నిలదీశారు. విశాఖ రాజధానిగా సమర్ధించనప్పుడు టీడీపీకి ఈ ప్రాంతం మీద ఓట్ల ప్రేమ తప్ప మరేమి ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. 

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధిలోకి తేవడం మా అభిమతం. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే హక్కు నీకెవరిచ్చారు...? మేం వారి అభిప్రాయాల్ని గౌరవిస్తాం కనుక ఉత్తరాంధ్రలో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలనేది మాకు తెలుసు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేస్తామని ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి మా లక్ష్యమని జగన్ చెబుతున్నారు. విశాఖ క్యాపిటిల్ ని ఈ రోజుకైనా ఒప్పుకుంటావా చెప్పు బాబూ అని ఆయన ప్రశ్నించారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధిలోకి రావడంతో పాటు విశాఖ ప్రపంచస్థాయి నగరం అవుతోందనేది అందరికీ తెలుసు. అలాంటిది చంద్రబాబు  ఒక్క పక్కన కోర్టులకెళ్లి మోకాలడ్డుతూ.. ఎన్నికలనగానే  ఇక్కడకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు  చెప్పే మాటల్ని నమ్మేంత అమాయకులేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర ప్రాంత నేతలుగా తాము రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకూ మనోభావాలు వారి ఆత్మగౌరవం ఏమిటో మాకు తెలుసు అని బొత్స అన్నారు. ఈరోజు ఎన్నికలనగానే చంద్రబాబు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం తన జాగీరు అన్నట్టు మాట్లాడితే కుదరదని బొత్స హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని బొత్స స్పష్టం చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?