
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ చంద్రబాబునాయుడిని అభాసుపాలు చేసింది. అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ను చాలా కాలంగా చంద్రబాబు కోరుతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా బాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అమిత్‌షాతో కలిసిన తర్వాత తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌తో పొలిటికల్ మైండ్ గేమ్ ఆడేందుకు టీడీపీ ఎత్తుగడ వేసింది.
అదేంటో గానీ, ఇటీవల కాలంలో టీడీపీ వేస్తున్న ప్రతి అడుగు భూమరాంగ్ అవుతోంది. అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించిన అనంతరం, ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు ఇచ్చేందుకు ఎల్లో బ్యాచ్ యత్నించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, అంతా రివర్స్. అసలు అమిత్‌షాతో భేటీ వూసే లేదు. పొత్తుల అంశాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి.
మరోవైపు జగన్ సర్కార్‌కు మోదీ సర్కార్ అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీంతో చంద్రబాబు హస్తినకు వెళ్లి అమిత్‌షా, నడ్డాతో భేటీలో ఏమీ జరగలేదని తేలిపోయింది. అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ను రామోజీ ఇప్పించారని, మార్గదర్శి కేసులో జగన్ దూకుడును అరికట్టాలని కేంద్రం నుంచి చెప్పించాలనే ప్రతిపాదనతో బాబును పంపించారనే ప్రచారం ఊపందుకుంది.
రామోజీ, ఆయన కోడలు శైలజను మార్గదర్శి కేసులో నుంచి బయటపడేసేందుకు చంద్రబాబు రాయబారం వర్కౌట్ కాలేదని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటైంది.
అమిత్ షా, నడ్డాతో భేటీ వల్ల బాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువైందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ ఛీత్కరించుకుంటున్నా, చంద్రబాబునాయుడు ఆత్మాభిమానం లేకుండా వాళ్ల చల్లని చూపు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారనే చెడ్డపేరు మూటకట్టుకున్నారు. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ, ఢిల్లీ ప్రాపకం కోసం బాబు వెంపర్లాడడం ఆ పార్టీ అభిమానులెవరికీ ఇష్టం లేదు. ఇంతకంటే చంద్రబాబుకు అవమానం ఏముంటుంది?
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా