Advertisement

Advertisement


Home > Politics - Andhra

సినిమా యాక్షన్ కాదు పవన్...

సినిమా యాక్షన్ కాదు పవన్...

జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ పోకడలలో సినీ ఫక్కీ కూడా ఉంటుంది. అంతవరకూ ఎందుకు ఆయనే ప్రసంగాలలో చెప్పుకుంటారు. నేను వకీల్ సాబ్ ని భీమ్నా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను అని. ఈ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. సభల్లో కూడా అభిమానుల చప్పట్లకు నోచుకుంటాయి.

కానీ ప్రజా జీవితంలో వీటికి మించినది ఉంటుంది. ఇక్కడ రియాలిటీ కావాలి. దానికే పెద్ద పీట ఎవరైనా వేస్తారు. అందుకే చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు. ఇక లేటెస్ట్ గా మంత్రి ధర్మాన ప్రసాదరావు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశారు. సినిమాల‌లో బొమ్మలతో చేసే యాక్షన్ కాదు ఇది ఫక్తు రాజకీయం, అసలైన ప్రజా జీవితం అని పవన్ని ఉద్దేశించి చెప్పాల్సిన నాలుగూ చెప్పారు.

పవన్ నాతో నడవగలరా అని కూడా చాలెంజి చేశారు. నా వయసు ఆరున్నర పదులు. అయినా నేను వేగంగా నడుస్తా, మరి పవన్ నాతో పాటు మూడు కిలోమీటర్ల దూరం అయినా నడవగలరా అంటూ ధర్మాన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలసలోని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పవన్ మీద ఆయన రాజకీయం మీద ఇలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

నిజ జీవితం ఎపుడూ భిన్నంగా ఉంటుందని అన్నారు. తాను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నానని ఆయన చెప్పుకున్నారు. మాటలతోనూ డైలాగులతోనూ రాజకీయాలు ఏ రోజూ నడవవు అంటూ పవన్ మీద కావాలనే నాలుగు  బాణాలు వేశారు.

ఇవన్నీ పక్కన పెట్టినా పవన్ ధర్మానతో నడవడం అన్న సవాల్ ని ఒప్పుకుంటారా. ఒకవేళ ఒప్పుకుంటే ఎవరు అలసిపోకుండా నడవగలరు అన్న దానికి ఆన్సర్ ప్రజల ఊహకే వదిలేయవచ్చు. ఎందుకంటే జవాబు ఎవరి ఇష్టం మేరకే ఉంటుంది కాబట్టి. 

పవన్ కేవలం సినిమా నటుడని ప్రజా జీవితం భిన్నమైనది అని చెప్పడమే ఇక్కడ ధర్మాన ఉద్దేశ్యం అని వైసీపీ నేతలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?