Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ చేస్తున్న యాగమేంటో తెలుసా...?

జగన్ చేస్తున్న యాగమేంటో తెలుసా...?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆధ్యాత్మికత ఎక్కువ. ఆయన మతం ఏదైనా హిందూ ధర్మం పట్ల కూడా కడు విశ్వాసంగా ఉంటారు. దానికి తార్కాణం ఆయన తరచూ మఠాలకు వెళ్తారు, పూజలు చేస్తారు. అలాగే దేవాలయాలకు వెళ్తే అక్కడి సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు. మరి అలాంటి జగన్ యాగాలు హోమాలు చేయరా అంటే చేస్తారేమో కదా.

జగన్ సీఎం అయ్యాక ఒక మహత్తర యాగమే చేస్తున్నారు. దాని పేరు పేదరిక నిర్మూలన యాగం. ఈ యాగం గురించి ముచ్చట్లు చెప్పిన వారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ. ఆయన విశాఖలో సింహాద్రి అప్పన్నను చందనోత్సవ వేళ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్ ఏపీలో పేదరికం లేకుండా ఉండాలని యాగం చేస్తూంటే కొన్ని శక్తులు ఆయన్ని అడ్డుకుంటున్నాయని, అనేక ఆటంకాలు కల్పిస్తున్నాయని విమర్శించాయి. అలాంటి శక్తుల నుంచి జగన్ని రాష్ట్రాన్ని కాపాడాలని తాను సింహాద్రి అప్పన్నను వేడుకున్నానని చెప్పారు.

నాడు ప్రహ్లాదుడిని రక్షించిన అప్పన్న అదే మాదిరిగా ఏపీ అభివృద్ధి కోసం తపన తాపత్రయం పడుతున్న జగన్ని నిండుగా దీవించాలని ఆయన మొక్కుకున్నారుట. ఏపీ భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడుతున్న జగన్ కి అలాగే ఏపీకి శక్తి ఇవ్వాలని కూడా కోరినట్లుగా మంత్రి గారు చెప్పారు. 

మొత్తానికి జగన్ యాగం చేస్తూంటే అడ్డుకుంటున్న ఆ దుష్ట శ‌క్తులేవో మంత్రి గారు చెప్పలేదు, కానీ రాజకీయం తెలిసిన వారికి ఈ పాటికే అవేమిటో అర్ధమైపోయి ఉంటాయి కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?