Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ నుంచి రూ.82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల

జగన్ నుంచి రూ.82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల, నేరుగా జగన్ కు పోటీ కాకపోయినా, తన ఘాటైన విమర్శలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు తన అఫిడపిట్ తో మరోసారి హెడ్ లైన్స్ కు ఎక్కారు.

కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె సమర్పించిన ఆస్తులు-అప్పుల అఫిడవిట్ చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువను 182.82 కోట్ల రూపాయలుగా ప్రకటించారు షర్మిల. వీటిలో 9 కోట్ల 29 లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపిన ఆమె.. 123 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు.

అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే, షర్మిల వద్ద 3 కోట్ల 69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలున్నాయి. వీటితో పాటు.. 4 కోట్ల 61 లక్షల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు ఉన్నాయి.

అయితే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఇది కాదు. షర్మిలకు ఏకంగా 82 కోట్ల 58 లక్షల రూపాయల అప్పు ఉందంట. ఇంత మొత్తం అప్పు ఎక్కడ్నుంచి తీసుకున్నారో తెలుసా? స్వయంగా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ అప్పు తీసుకున్నట్టు తన అఫిడవిట్ లో వెల్లడించారు షర్మిల. అంతేకాదు, తన వదిన భారతి నుంచి కూడా 19 లక్షల 56వేల రూపాయలు అప్పు తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు.

ఈ అప్పుల్లో మరో ట్విస్ట్ కూడా ఉంది. జగన్ నుంచి 82 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న షర్మిల.. అందులోంచి 30 కోట్ల రూపాయల్ని తన భర్త అనీల్ కు అప్పుగా ఇచ్చారు. ఇక కేసుల విషయానికొస్తే, షర్మిలపై 8 కేసులున్నాయి. ఈ విషయాలన్నింటినీ ఆమె తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?