Advertisement

Advertisement


Home > Politics - Andhra

స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకు మరో అడుగు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకు మరో అడుగు

ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రెండేళ్ళుగా నలుగుతోంది. బయటకు ఏమీ జరగనట్లుగా కనిపిస్తున్నా సంస్థాగతంగా ఆ దిశగానే ప్లాంట్ ని ప్రభుత్వ పెద్దలు తీసుకెళ్తున్నారు. ప్లాంట్ లో కీలక విభాగాలను చేష్టలుడిగేలా చేసే చర్యలు సాగుతూనే ఉన్నాయి.

కార్మిక లోకం ఒక్కటిగా గొంతెత్తి ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని నినదిస్తోంది. కానీ వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి అదానీ గ్రూపునకు సంబంధించిన కమిటీ వచ్చింది. కీలకమైన సమావేశం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ లో జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న కార్మిక నాయకులు పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ఎదుటకు చేరుకుని నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానీయమని అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వచ్చిన స్టీల్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రాకను నిరసిస్తూ  స్టీల్ ప్లాంట్  కార్మికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు.

అయితే ప్రైవేటీకరణ వ్యవహారం తీసుకుంటే మరో అడుగు ముందుకు పడినట్లే అని తెలుస్తోంది. ఈ మధ్యనే విశాఖ వచ్చిన ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అన్న ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయారు. దాంతో నాడే ఇక ప్లాంట్ ప్రైవేట్ పరమని తేలిపోయింది. ఇపుడు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ పరిశీలన పేరిట స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టడంతో ఆశలు మరింతగా సన్నగిల్లుతున్నాయని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?