Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆహా ఓహో... బీజేపీ అభ్య‌ర్థి కూడా టీడీపీ నాయ‌కుడేనా?

ఆహా ఓహో... బీజేపీ అభ్య‌ర్థి కూడా టీడీపీ నాయ‌కుడేనా?

ఇప్ప‌టికే జ‌న‌సేన టికెట్ల‌లో చాలా వ‌ర‌కూ టీడీపీ ఆక్ర‌మించింది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ముందే ఒప్పందం చేసుకునే, పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ సీట్ల‌ను చంద్ర‌బాబు ఇచ్చార‌ని ఆల‌స్యంగా ప‌వ‌న్ అభిమానుల‌కు తెలిసింది. దీంతో జ‌న‌సేన మొత్తం ఖాళీ అయ్యింది. జ‌న‌సేనే అనుకుంటే, ఇప్పుడు బీజేపీకి కేటాయించిన చోట కూడా టీడీపీ ఇన్‌చార్జ్ పోటీ చేస్తార‌ట‌!

తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నుంచి బీజేపీ త‌ర‌పున టీడీపీ ఇన్‌చార్జ్ న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అన‌ప‌ర్తి నుంచి రామ‌కృష్ణారెడ్డికి చంద్ర‌బాబునాయుడు సీటు ఖరారు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీతో పొత్తు కుద‌ర‌డంతో అన‌ప‌ర్తిని ఆ పార్టీకి కేటాయించారు. బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ సైనికుడు శివ‌రామ‌కృష్ణంరాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌చారంలో ఉన్నారు. మ‌రోవైపు రామ‌కృష్ణారెడ్డి త‌నకు కేటాయించిన టికెట్‌ను ర‌ద్దు చేసి, బీజేపీకి ఇవ్వ‌డంతో మ‌న‌స్తాపం చెందారు. న్యాయం కోసమంటూ ఆయ‌న ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డిని త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ ఆహ్వానించడం గ‌మ‌నార్హం. బీజేపీలో చేరే విష‌యమై ఆదివారం త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఆత్మీయ స‌మావేశాల‌న్నీ జ‌నాన్ని మ‌భ్య పెట్టేందుకే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం టికెట్ కోస‌మే రామ‌కృష్ణారెడ్డి బీజేపీలో చేర‌నున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్ప‌టికే వైఎస్సార్ జిల్లాలో బ‌ద్వేలులో బీజేపీ నాయ‌కుడు సురేష్‌ను రాజ‌కీయంగా బ‌లి పెట్టి, టీడీపీ నాయ‌కుడు రోశ‌న్న‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు అన‌ప‌ర్తిలో మాజీ సైనికుడు శివ‌రామ‌కృష్ణంరాజుకు అదే గ‌తి ప‌ట్టించి, టీడీపీ ఇన్‌చార్జ్ రామ‌కృష్ణారెడ్డికి సీటు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న మాట‌. మ‌రిది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌న పార్టీ వాళ్ల‌ను పురందేశ్వ‌రి రాజ‌కీయంగా అణ‌చివేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?