Advertisement

Advertisement


Home > Politics - Andhra

గంట పాటు అతి భారీ వర్షం కురిస్తే....?

గంట పాటు అతి భారీ వర్షం కురిస్తే....?

ఈ రోజు మహా నగరాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చిన్నపాటి వానకే వీధులతో సహా మొత్తం బంగళాలు అన్ని నీట మునిగే పరిస్థితి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ఒక హెచ్చరిక చేసింది. విశాఖలో ఆగకుండా ఒక గంట పాటు అతి భారీ వర్షం కురుస్తుందని. ఒక విధంగా రెడ్ అలెర్ట్ ని జారీ చేసింది. అంతా ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని కూడా సూచించింది.

అయితే విశాఖలో శుక్రవారం నల్లని మేఘాలు నగరాన్ని భయపెట్టాయి. అతి భారీ వాన కురియడం ఖాయం అనుకున్నా పెద్దగా కురిసింది లేదు, ఆ మీదట వెలిసిపోయింది. అయితే విశాఖకు భారీ వర్షం ముప్పు ఇంకా పొంచి ఉందా అన్న అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి.

ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాలు భారీ వానలకు అల్లల్లాడిపోయిన సంగతి తెలిసిందే. మరి విశాఖలో అంతటి స్థాయిలో వాన కురిస్తే తట్టుకుంటుందా అన్నదే సందేహం. అయితే సిటీ కొండ పైన ఉంది. బీచ్ దిగువన ఉంది. కాబట్టి కురిసిన వాన నీరు అంతా సాగరంలో కలసిపోతుంది అన్న సహజమైన  నిబ్బరం అయితే ఉంది.

కానీ సిటీలో అడ్డూ అదుపూ లేని నిర్మాణాల కారణంగా పల్లానికి పోయే నీరుకు దారి చూపించకపోతే మాత్రం అన్నీ కాకపోయినా కొన్ని ప్రాంతాలు అయినా జల విలయాన్ని చూడడం ఖాయం. ఏది ఏమైనా రెడ్ అలెర్ట్ విశాఖను భయపెట్టింది అనే చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?