Advertisement

Advertisement


Home > Politics - Andhra

త‌ప్పుకుంటే అవినాష్ మంచోడ‌వుతాడా సునీతా!

త‌ప్పుకుంటే అవినాష్ మంచోడ‌వుతాడా సునీతా!

వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు వైఎస్ సునీత క‌డ‌ప లోక్ స‌భ సీటు ప‌రిధిలో ష‌ర్మిల వెంట ప్ర‌చారం చేస్తున్నారు. ఈ అక్క‌చెల్లెళ్లు తామే జ‌డ్జిలు అయిన‌ట్టుగా వివేకానంద‌రెడ్డిని అవినాష్ రెడ్డి చంపాడంటూ బాహాటంగా ప్ర‌చారం చేశారు. కోర్టు ప‌రిధిలో ఉన్న ఒక అంశం గురించి అలా మాట్లాడొచ్చా, రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డిన వాళ్ల‌ను కూడా కోర్టు లో రుజువ‌య్యే వ‌ర‌కూ నిందితుడిగానే వ్య‌వ‌హ‌రించాల‌నేది మ‌న సమాజం చ‌ట్ట‌ప‌రంగా పెట్టుకున్న నియ‌మం! అయితే ఈ అక్క‌చెల్లెళ్లు మాత్రం త‌మ‌చిత్తానికి మాట్లాడుతూ తిరిగారు. చివ‌ర‌కు వీరి తీరుపై కోర్టు స్పందించింది. తోచిన‌ట్టుగా మాట్లాడి రాజ‌కీయ ప్ర‌యోజాలు పొందే ఎత్తుగ‌డ‌లు వేయొద్దంటూ వీరికి కోర్టు స్ప‌ష్టం చేసింది. 

ఆ సంగ‌త‌లా ఉంటే.. వైఎస్ అవినాష్ రెడ్డికి కౌంట‌ర్ ఏదో ఇవ్వ‌బోయి సునీత చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముందుగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌పై ష‌ర్మిల‌, సునీత‌లు చేస్తున్న ప్ర‌చారంపై వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్న‌ట్టుగా మాట్లాడాతాడు. త‌ను క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న ఎన్నిక‌ల్లో త‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న వివేకానంద‌రెడ్డిని త‌ను ఎందుకు చంపుకుంటానంటూ అవినాష్ ఆవేధ‌న‌పూరితంగా స్పందిస్తాడు

దీనిపై సునీత కౌంట‌రిస్తూ.. అది నిజ‌మేన‌ని అంటుంది. వివేకానంద‌రెడ్డి చ‌నిపోయే రాత్రికి ముందు కూడా వేంప‌ల్లిలో అవినాష్ కోసం ప్ర‌చారం చేశార‌ని సునీత చెబుతుంది. అది నిజ‌మే అంటుంది. జ‌గ‌న్ ను సీఎంగా చూడాలని వివేక ఆశించార‌ని, అలాగే ష‌ర్మిల‌ను ఎంపీగా చూడాల‌ని కూడా అనుకున్నార‌ని.. అది వివేక చివ‌రి కోరిక అని, కాబ‌ట్టి.. మీరు ఈ ఎన్నికల బ‌రి నుంచి త‌ప్పుకోవాలంటూ అవినాష్ ను ఉద్దేశించి సునీత వ్యాఖ్యానిస్తుంది. వివేక చివ‌రి కోరిక‌ను తీర్చేగ‌ల‌ర‌ని.. అందుకే స్కిప్ దిస్ ఎల‌క్ష‌న్ అంటూ.. అవినాష్ కు సునీత బాహాటంగా సూచిస్తోంది!

ఆ మాట‌ల తాత్ప‌ర్యం ఎలా ఉందంటే.. ఇప్పుడు ష‌ర్మిల ఎంపీగా ఎన్నిక‌కావ‌డానికి అనుగుణంగా అవినాష్ రెడ్డి త‌ప్పుకుంటే చాల‌న్న‌ట్టుగా ఉంది సునీత మాట తీరు! అంటే.. క‌డ‌ప లోక్ స‌భ సీటుకు అవినాష్ రెడ్డి పోటీలో ఉంటే అత‌డో హంత‌కుడు, ఇప్పుడు ష‌ర్మిల గెలుపు కోసం ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకుంటే.. మంచోడ‌యిపోగ‌ల‌డు అన్న‌ట్టుగా ఉంది వైఎస్ సునీత మాట‌ల్లోని అర్థం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?