Advertisement

Advertisement


Home > Politics - Gossip

రవి ప్రకాష్ కు దారులన్నీ మూసుకుపోయాయా!

రవి ప్రకాష్ కు దారులన్నీ మూసుకుపోయాయా!

మాజీ ఎంపీ వివేక్ భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. గత కొన్నాళ్లుగా రాజకీయంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వివేక్. అయితే ఎక్కడా నెగ్గుకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరారాయన. తెలంగాణలో కమలం పార్టీ పుంజుకుంటోంది అనే లెక్కల నడుమ వివేక్ ఆ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల నుంచి వచ్చి చేరతామనే వారికి బీజేపీ రెడ్ కార్పేట్ పరుస్తూ ఉంది. ఈ క్రమంలో వివేక్  కు కూడా గ్రాండ్ వెల్కమ్ లభించింది.

ఆ సంగతలా ఉంటే.. వివేక్ బీజేపీలో చేరడం పరోక్షంగా టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ కు ఇబ్బందికరమైన అంశంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. దానివెనుక ఒక అంతర్గత రాజకీయం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. టీవీ నైన్ నుంచి పదవీ భ్రష్టుడు అయిన రవి ప్రకాష్ అందుకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ కేసులు ఇప్పుడప్పుడే తేలేలా లేవు. అయితే ఇంతలోనే రవి ప్రకాష్ భారతీయ జనతా పార్టీ వాళ్లను శరణుజొచ్చాడు అనేమాట వినిపిస్తూ ఉంది.

బీజేపీకి తెలంగాణలో మీడియా సహకారం చాలానే అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తన అనుభవాన్ని ఉపయోగించుకుని కొత్త టీవీ చానల్ పెట్టి దాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నడిపించడం అనేది రవిప్రకాష్ దగ్గర ఉన్న ప్లాన్ అని సమాచారం. అందుకే ఆయన విచారణను తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉందని, బీజేపీ పెద్దల సహకారంతో కేసుల నుంచి కూడా బయటపడేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు రవి ప్రకాష్ అనే ప్రచారం జరుగుతూ ఉంది.

బీజేపీ వాళ్లు రవి ప్రకాష్ ఏమైనా సహకారం అందిస్తారు అంటే అదికేవలం టీవీ చానల్ ను ఎరగా వేయడమే! టీవీ చానల్ పెట్టి బీజేపీకి సహకారించడం అనేమాటలు చెప్పే రవి ప్రకాష్ వారి నుంచి సహకారం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. అయితే ఇప్పుడు వివేక్ చేరికతో భారతీయ జనతా పార్టీకి కీలకమైన లోటు తీరింది. అదే టీవీ చానల్ లోటు! వివేక్ చేతిలో మీడియా ఆయుధం ఉంది. తెలంగాణ వరకూ ప్రముఖంగా ఉన్న టీవీ చానల్ తో పాటు ప్రింట్ మీడియా కూడా వివేక్ చేతిలో ఉంది. ఆయన బీజేపీలోకి చేరడంతో సహజంగానే ఆ మీడియా వర్గాలు కమలం పార్టీకి అనుకూలంగా అయ్యే అవకాశాలున్నాయి.

ఇక ప్రత్యేకంగా బీజేపీకి మీడియా కావాలనే అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి రవి ప్రకాష్ ఆటలు సాగకపోవచ్చని, ఇప్పటి వరకూ పెట్టుబడిదారులు కూడా అతడికి ఎవరూ సహకారం అందిస్తామంటూ ముందుకు రాలేదు. దీంతో రవి ప్రకాష్ ను బీజేపీ పూర్తిగా లైట్ తీసుకోవచ్చని, వివేక్ ఎంట్రీతో రవి ప్రకాష్ కు చెక్ పడిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక టీవీ నైన్ లో సీఈవో గా తన దుశ్చర్యలతో రవి ప్రకాష్ కొత్తగా పెట్టుబడిదారులను నమ్మించలేకపోతున్నారట. అక్కడ అధికార దుర్వినియోగం చేసి, తప్పుడు  పనులకు పాల్పడ్డాడు అనే అభియోగాలతో కేసులను ఎదుర్కొంటున్నాడు రవి ప్రకాష్. ఈ నేపథ్యంలో మళ్లీ అతడిని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వినికిడి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?