Advertisement

Advertisement


Home > Politics - Gossip

తమ్ముళ్ల విశ్వాసంపై చంద్రబాబు మరో సమ్మెట దెబ్బ!

తమ్ముళ్ల విశ్వాసంపై చంద్రబాబు మరో సమ్మెట దెబ్బ!

ప్రీపోల్ సర్వేలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తున్న సమయంలో.. 'జగన్ మీడియా మేనేజ్ మెంట్ చేశారు..' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రశాంత్ కిషోర్ టీమ్ ను కూడా లాగారు. పీకే టీమ్ జాతీయ మీడియాను మేనేజ్ చేస్తుందని అందుకే ఆ సర్వేలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చాయని చెప్పుకొచ్చింది. అయినా అలాంటి సర్వేలను ఒక ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా ఇస్తే అది తమ క్రెడిబులిటీని దెబ్బ తీస్తుందని జాతీయ మీడియా వాళ్లకు భయం ఉండదు? వాళ్లకు జగన్ తో ఏ కుల సంబంధమో కూడా లేదు!

చంద్రబాబుతో కుల సంబంధం ఉన్న మీడియా వర్గాలు తెలుగుదేశం పార్టీకి జాకీలు వేస్తూనే ఉంటాయి. అలాంటి కుల సంబంధాలు జాతీయ మీడియాతో జగన్ కు ఏమీలేవు. అయినా ఆ సర్వేలను తక్కువ చేసి చూపేందుకే తెలుగుదేశం బ్యాచ్ తీవ్రంగా శ్రమించింది. ఇక ప్రీపోల్ సర్వేల్లోనే కాదట, ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఆ పార్టీ అధినేత తేల్చేశారు. ఇంకా వాటి విడుదలకు ముందే చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లకు ఆ సందేశాన్ని ఇచ్చేశారు.

తద్వారా ఇంకా విజయం మీద ఎవరైనా ఆశలు పెట్టుకుని ఉంటే వారి ఆశల మీద చంద్రబాబు నాయుడు మరో సమ్మెట దెబ్బవేశారు. ప్రీపోల్ సర్వేలు ఎగనైస్ట్ గా వచ్చినప్పుడేమో అదంతా జగన్ కుట్ర అన్నారు, ఇంకా ఎగ్జిట్ పోల్స్ విడుదల కాకుండానే.. అవి టీడీపీకి ఎగనైస్ట్ గా ఉంటాయని తేల్చేశారు. మరి 'మే 23న ఫలితాలు  కూడా పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయి, ఆందోళన చెందవద్దు..' అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ శ్రేణులకు సందేశం ఇస్తున్నారనే టోన్ కూడా ఈ మాటల నుంచినే వినిపిస్తూ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?