Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇదేనా తెలుగుతేజం

ఇదేనా తెలుగుతేజం

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వెయ్యి కోట్ల విలువైన టీకాలకు ఆర్డరు పెట్టింది. కానీ టీకా కంపెనీలు అయిన సీరమ్, భారత్ బయోటెక్ ముందుగా డబ్బులు ఇస్తేనే టీకాలు ఇస్తాం లేదంటే ఇవ్వము అని కరాఖండీగా చెప్పేసాయి. 

ఈలోగా పుణ్యకాలం దాటిపోయి కేంద్రం మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. మహరాష్ట్ర, గుజరాత్ లకు కోట్లలో టీకాలు కేటాయిస్తే ఆంధ్రకు లక్షల్లో టీకాలు కేటాయించింది.

ఇదీ జరిగింది. మనం చెబుతున్నమాట కాదు. తెలుగుదేశం పార్టీ నమ్మదగ్గ మీడియానే వెల్లడించిన విషయం.

ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించవు. అది వాస్తవం. కానీ మీడియా వుందిగా. టీకాలకు బిల్లులు చెల్లించలేదని ఉప్పు అందిస్తే చాలు నిలదీస్తాయి. బిల్లులు చెల్లించేలా చేస్తాయి. వస్తాయి కానీ రాకుండాపోవు.

సరే, సీరమ్ కంపెనీకి అంటే తెలుగు జనాలతో బంధాలు, సెంటిమెంట్లు లేవు. భారత్ బయోటెక్ మన గడ్డ మీద వున్న కంపెనీ. మన తెలుగుతేజం అని గర్వంగా చెప్పుకునేవారి కంపెనీ. పైగా చంద్రబాబు తానే తీసుకువచ్చా అని చెప్పే కంపెనీ. మరి అలాంటి కంపెనీకి తెలుగు ప్రజల పట్ల ఆ మాత్రం బాధ్యత లేదా? పోనీ జగన్ మీద నమ్మకం లేదు అనుకుందాం. 

చంద్రబాబు అయినా పూనుకోవచ్చు కదా..తాను హామీ వుంటా అని ఓపెన్ గా ప్రకటించి వుండొచ్చు కదా. తెలుగు ప్రజలు అంతా జేజేలు పలికేవారు. కచ్చితంగా బాబుగారి ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగి వుండేది. 

అలాంటి సువర్ణావకాశాన్ని వదిలేసారు. భారత్ బయోటెక్ కూడా తన జన్మభూమి అభిమానాన్ని పక్కన పెట్టి కేవలం వ్యాపారం మాత్రమే చూసుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?