వ‌ర్మ‌ను ర్యాగింగ్ చేస్తున్న జన‌సేన

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌ను జ‌న‌సేన రాజ‌కీయంగా ర్యాగింగ్ చేస్తోంది.

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌ను జ‌న‌సేన రాజ‌కీయంగా ర్యాగింగ్ చేస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి విడ‌త‌లోనే ఎమ్మెల్సీ ప‌దవి ద‌క్క‌లేద‌న్న ఆవేద‌న వ‌ర్మ‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. ఈ త‌రుణంలో పుండుమీద కారం చ‌ల్లిన చందంగా… పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌డావుడి చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కించుకున్న నాగ‌బాబుకు భారీ ప్లెక్సీలు, అలాగే ఆయ‌న‌కు స‌న్మానాలు… త‌దిత‌ర అంశాలు వ‌ర్మ‌ను రెచ్చ‌గొట్ట‌డానికే అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జ‌న‌సేన‌కు కేటాయించారు. అక్క‌డి నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేశారు. త‌న‌ను గెలిపించే బాధ్య‌త వ‌ర్మ‌దే అని ప‌వ‌న్ బ‌హిరంగంగా అన్నారు. దీంతో ప‌వ‌న్ గెలుపు బాధ్య‌త‌ను వ‌ర్మ భుజాన వేసుకున్నారు. ప‌వ‌న్ గెలిస్తే, పిఠాపురంలో త‌నదే పెత్త‌నం అని వ‌ర్మ న‌మ్మారు.

అయితే రాజ‌కీయాల్లో అలా వుండ‌ద‌ని వ‌ర్మ ఆలోచించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కూట‌మి అధికారంలోకి రావ‌డం, డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం, పిఠాపురంలో వ్య‌వ‌హారాల్ని చూసుకోడానికి జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌తినిధిని నియ‌మించ‌డం, టీడీపీ శ్రేణుల ప‌నులేవీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వ‌ర్మ ర‌గిలిపోతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింద‌ని పిఠాపురంలో జ‌న‌సేన ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌ను రెచ్చ‌గొట్టేలా ర‌చ్చ చేస్తున్నార‌ని స‌న్నిహితుల‌తో వ‌ర్మ అంటున్నార‌ని తెలిసింది. నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చింద‌నే ఆనందం కంటే, త‌న‌కు రాలేద‌నే సంతోషం జ‌న‌సేన‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తోందని వ‌ర్మ వాపోతున్నార‌ని తెలిసింది.

11 Replies to “వ‌ర్మ‌ను ర్యాగింగ్ చేస్తున్న జన‌సేన”

  1. “ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న నాగబాబు కు భారీ ఫ్లెక్సీలు “.. ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కదా

  2. 😂😂😂😂…..మన అన్నయ్య కి elections లో వోడిపోయిన బాధ కంటే….షెలెమ్మ కి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనె బాధ యెక్కువ గా వుంది అనే range లో కలిపావు గా GA పులిహోర….👌👌

  3. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో రాజులంటే దక్షిణాదిలో మంచి పేరు ఉండేది.

    విగ్గు రాజు దాన్ని కిందకి లాగుతుంటే ..మిగతావాళ్ళు తలొక చెయ్యి వేశారు.

    ఇప్పుడు వర్మ , కర్మ వచ్చి ఖర్మ కాలేలా చేసింది.

    యిలాగే ఇంకో 10 ఏళ్ళు పోతే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో రాజులుండే వాళ్ళు అని చెప్పుకుంటారు.

  4. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో రాజులంటే దక్షిణాదిలో మంచి పేరు ఉండేది.

    విగ్గు రాజు దాన్ని కిందకి లాగుతుంటే ..మిగతావాళ్ళు తలొక చెయ్యి వేశారు.

    ఇప్పుడు వర్మ , కర్మ వచ్చి ఖర్మ కాలేలా చేసింది.

    యిలాగే ఇంకో 10 ఏళ్ళు పోతే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో రాజులుండే వాళ్ళు అని చెప్పుకుంటారు.

Comments are closed.