Advertisement

Advertisement


Home > Politics - Gossip

లోకేష్.. అది పరామ‌ర్శా, పార్టీ చేసుకున్నారా!

లోకేష్.. అది పరామ‌ర్శా, పార్టీ చేసుకున్నారా!

వెళ్లింది ప‌రామ‌ర్శ‌కు అంటే ఆశ్చ‌ర్య‌పోవాలి! అవ‌త‌ల ఆ తండ్రీ కొడుకును అరెస్టు చేసి లోప‌లేశారు. త‌మ జీవితంలో ఎన్న‌డూ చూడ‌ని జైలును వాళ్లు చూస్తున్నారిప్పుడు. త‌మ‌కు ఎదురుచెప్పిన వాడి మీద ఎగిరెగిరి ప‌డ‌ట‌మే కానీ, ఎన్ని కేసులు పెట్టుకున్నా పోలీసుల‌ను బూతులు తిట్ట‌డ‌మే కానీ.. వాళ్లు జైలు వెళ్ల‌డం గురించి క‌ల‌లో అయినా అనుకోని ఉండ‌రు పాపం! అలాంటి మ‌ద‌గ‌జాలు జైల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటే, బ‌య‌ట ప‌రిస్థితి ఇది!

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్ రెడ్డిల అరెస్టు నేప‌థ్యంలో జేసీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్ కు సంబంధించిన ఫొటోలు ఈ ర‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి! ఈ ఫొటోలు చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

వాళ్లింట్లో వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి అంటూ వెళ్లి ఇలా వాళ్లింట్లోనే పార్టీ చేసుకున్న‌ట్టుగా ఉందేంట‌ని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫొటోని, ఈ ఫొటోలోని జ‌నాల హావ‌భావ‌ల‌ను చూస్తే.. వీళ్లు త‌మ వారు జైలుకు వెళ్లినందుకు బాధ‌ప‌డుతున్న‌ట్టుగా లేర‌ని, ఎవ‌రో జైలు పాలైతే ఆనందంతో పార్టీ చేసుకున్న‌ట్టుగా ఉంద‌నే కామెంట్లూ త‌ప్ప‌డం లేదు!

అస‌లే త‌న తిండి గురించి లోకేష్ స్వ‌యంగా చెప్పుకున్నారాయా! ఒక్క‌సారి తిన‌డం మొద‌లుపెడితే ఆప‌డం ఉండ‌ద‌ని ఆయ‌నే స్వ‌యంగా సెల్ఫ్ స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్న వ్య‌క్తి. ఈ మ‌ధ్య‌నే లాక్ డౌన్ లో గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డి వెయిట్ త‌గ్గిన విష‌యాన్నీ ప్ర‌క‌టించుకున్నారు. మ‌రి ఇలాంట‌ప్పుడు ఇలా పార్టీలు అంటే.. ఇలా ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్లిన చోట ఇలాంటి సీన్లు క‌నిపిస్తే.. లోకేష్ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తారేమో!

జగన్ తో పోటీ కష్టం బాబూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?